HomeNewsBreaking Newsఆ పాపం ఎవరిది?

ఆ పాపం ఎవరిది?

తాగు, సాగునీటి సరఫరాపై సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ దేశంలో జీవనదులు ఉన్నప్పటికీ తాగు, సాగు నీరు అందించని పాపం ఎవరిదని బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు తాగునీళ్లు ఇవ్వలేరా?, ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా?, ఇంటికి పంపిచాలా? అని అన్నారు. ఔరంగాబాద్‌ జబిందా మైదానంలో సోమవారం జరిగిన బిఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కెసిఆర్‌ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌, బసవేశ్వరుడు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు ఆయ న నివాళులర్పించారు. అనంతరం పలువురు బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కెసిఆర్‌ గులాబీ కండువాలు పార్టీలోనికి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు బిఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం కెసిఆర్‌ ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్‌కు ఒక లక్ష్యం ఉన్నదని, తన మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోవద్దని, దీనిపైన గ్రామాలకు వెళ్లి చర్చ చేయాలని సూచించారు. దేశం ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా ? అనే అంశంపైన చర్చ పెట్టాలని, దేశం లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముం దుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా? అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకని ప్రశ్నించారు. ముంబయి దేశ ఆర్థిక రాజధాని అయినా తాగేందుకు నీళ్లుండవా? తాగడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరని, దేశం పురోగమిస్తుందా?, తిరోగమిస్తుందా ఒక సారి ఆలోచించాలని కోరారు. ఔరంగాబాద్‌, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.
ఎంత త్వరగా మేలుకోంటే అంత త్వరగా బాగుపడుతాం
దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ఇదంతా మన కళ్లముందే జరుగుతుందని, ఇది ఇలాగే జరగాలా?, చికిత్స చేయాలా? , ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతామని సిఎం తెలిపారు. సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలని,ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా?, తెలంగాణలో సమస్య లేకుండా చే శాం. అన్నివర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే. భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారని, ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదని, అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బిఆర్‌ఎస్‌ పుట్టిందని వివరించారు..
మహారాష్ట్రలో అధికారంలోనికి వస్తే ప్రతి ఇంటికీ నీరు
రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని, యువతకు ఉద్యోగాల్లేవని సిఎం అన్నారు. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నప్పటికీ సాగు యోగత్య ఉన్న భూములకు నీరు అందించాల్సి ఉన్నదని, కానీ ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని ఆరోపించారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరిస్తామని ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగబోదని,రైతులకు అన్నీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేస్తామని భరోసనిచ్చారు. బిఆర్‌ఎస్‌పైన నమ్మకం పెట్టాలని, ఒక కులం, మతం, వర్గం కోసం బిఆర్‌ఎస్‌ ఆవిర్భవించలేదని స్పష్టం చేశారు. కాగా ఔరంగబాద్‌ సభలో మాజీ ఐఎఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయన పేరును సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments