బిసిసిఐ చీఫ్ సౌరవ్‌గంగూలీ
ముంబయి : ఈ ఏడాది ఆస్ట్రేలియా, వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో భారత్ ఒక డే/నైట్ టెస్ట్ ఆడుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం దాదా మీడియాతో మాట్లాడాడు. ’ డే/నైట్ టెస్ట్‌లు జరుగుతాయి. త్వరలో వీటిపై మేం అధికారిక ప్రకటన చేస్తాం. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్, ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ఫ్ల్‌డ లైట్ల మ్యాచ్‌లు ఉంటాయి’అని తెలిపాడు. ఇక ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ప్రకారం భారత్ ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. అయితే ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఏదో ఒక మ్యాచ్ భారత్ పింక్ బాల్‌తో ఆడనుంది. ఇక 2021 జూలైలో ఇంగ్ల్‌ండ పర్యటించనున్న భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. గంగూలీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇందులో కూడా ఒక మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల కింద జరిగే అవకాశం ఉంది. ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్‌ను డే/నైట్ మ్యాచ్ ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరగా.. తమ ఆటగాళ్లకు అనుభవం లేదని బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. అయితే బీసీసీఐ పగ్గాలందుకున్న వెంటనే గంగూలీ.. పింక్ బాల్ మ్యాచ్‌కు విముఖత వ్యక్తం చేసిన కోహ్లీని ఒప్పించి.. బంగ్లాదేశ్‌ను రప్పించి అంగరంగ వైభవంగా కోల్‌కతా వేదికగా తొలి గులాబీ మ్యాచ్‌ను నిర్వహించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్నందుకుంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సందర్భంగా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. పింక్ బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమని, ప్రపంచంలో ఎక్కడైనా ఏ జట్టుతోనైనా తలపడుతామని స్పష్టం చేశాడు. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు బీసీసీఐ అధికారులతో చర్చించి పింక్ బాల్ మ్యాచ్ నిర్వహణకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక పింక్ బాల్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా సూపర్ రికార్డు కలిగి ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఆ జట్లతో భారత్ డే/నైట్ టెస్టులు ఆడుతుంది
RELATED ARTICLES