ఎస్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు అంశం తప్ప అన్ని విషయాలపై ట్రంప్, మోడీ ద్వైపాక్షిక చర్చలు
జి20 సదస్సులో ఇతర నేతలతోనూ సమాలోచనలు
ఒసాకా: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్న ఎస్ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రస్తావన రాలేదని భారత్ శుక్రవారం తెలిపింది. వారిద్దరి మధ్య ద్వైపాక్షిక సైనిక సహకార ఏర్పాట్లకు సంబంధించిన చర్చే జరిగిందని సమాచారం. ఎస్ అనేది ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక రష్యా క్షిపణి వ్యవస్థ. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా మొదట 2014లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే భారత్ మధ్య మాత్రం 2018 అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జి20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని ఒసాకాలో ఉన్న ప్రధాని మోడీ ట్రంప్‌తో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం మోడీ, ట్రంప్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్ ‘అమెరికా ఉత్పత్తుల దిగుమతిపై భారత్ అధిక సుంకాలు వేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అభినందనలు తెలియజేశారు. జి20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ట్రంప్ ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు, 5జి సాంకేతికత, రక్షణ రంగంలో సహకారమే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ‘మీ(ట్రంప్)తో భేటీ కావ డం సంతోషంగా ఉంది. రెండోసారి భారత ప్రజ లు నాకు సంపూర్ణ మద్దతు తెలపడంపై ఫోన్ ద్వారా మీరు శుభాకాంక్షలు తెలిపారు. దానికి కృతజ్ఞతలు. భారత్‌తో సంబంధాల పట్ల మీ ఆసక్తిని తెలియజేస్తూ మీరు రాసిన లేఖను రెండు రోజుల క్రితం అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మాకు అందించారు. సానుకూల వాతావరణంలో పాంపియోతో భేటీ జరిగింది. ట్రంప్, మోడీ మధ్య జరిగిన భేటీలో ఇరాన్, 5జి, వాణిజ్యం, రక్షణ సహకారం వంటి నాలుగు అంశాలపై చర్చించడం జరిగింది. ఇరాన్‌కు సంబంధించినంత వరకు మా ఇంధన అవసరాలు, ప్రాంతీయ శాంతి, సుస్థిరత లు ముఖ్యం. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది’ అని మోడీ, ట్రంప్‌కు చెప్పినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ‘భారత ఇంధన అవసరాలను 11 శాతం మేరకు ఇరాన్ తీరుస్తోందని మోడీ, ట్రంప్‌కు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమే అయినప్పటికీ ఇరాన్ నుంచి చమురు దిగుమతిని భారత్ తగ్గించుకుంది’ అని విజయ్ గోఖలే తెలిపారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకుగాను భారత్ గల్ఫ్‌లో తన నావికాదళ నౌకలను దించింది. కాగా గల్ఫ్‌లో సుస్థిరతను కాపాడతామని, మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉండేలా చూస్తామని ట్రంప్ తెలిపారు. 5జి టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలో భారత్ సహకారం గురించి మోడీ, ట్రంప్ శుక్రవారం చర్చించారు. అమెరికా కంపెనీలు ఇప్పటికే 5జి టెక్నాలజీలో పనిచేస్తున్నాయి.ఈ రంగంలో భార త్, అమెరికా సహకారం గురించి వారు చర్చించా రు. ద్వైపాక్షిక వాణిజ్య వివాదాలు పరిష్కరించుకునేందుకు వీలయినంత త్వరగా ఇరుదేశాల వాణిజ్య మంత్రుల సమావేశం నిర్వహించే విషయంలో మోడీ, ట్రంప్ అంగీకారానికి వచ్చారు. ‘అమెరికా వస్తువుల దిగుమతి విధిస్తున్న అత్యధిక సుంకాలను తగ్గించుకోవాలని ట్రంప్ కోరారు. సమావేశం తర్వాత ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపాను.టెక్నాలజీ, రక్ష ణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలు సహకరించుకును విషయాలపై చర్చించాను’ అని మోడీ ట్వీ ట్ చేశారు. అమెరికా భారత వస్తువులకు ఇచ్చే వాణిజ్య ప్రోత్సాహకం..జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్(జిఎస్‌పి)ని ఉపసంరించుకున్నాక భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 వస్తువులపై సుంకాలు పెంచింది. గత నెల అమెరికా నుంచి దిగుమతి అయ్యే హార్లీ మోటార్‌సైకిల్‌పై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. స్టీలు, అల్యూమినయంలపై అమెరికా గణనీయంగా దిగుమతి సుంకాలు పెంచేసింది. ఈ విషయంలో భారత్, అమెరికాను ప్రంపంచ వాణిజ్య సంస్థ వివాదాల పరిష్కార యంత్రాంగం ముందు కు లాగింది. డేటా లోకలైజేషన్ చేపట్టాలన్న భారత్ నియమంపై అమెరికాకు చెందిన గూగుల్, మాసర్ కార్డ్, వీసా, అమెజాన్ వంటి అమెరికా కంపెనీలు భయాందోళనలను వ్యకం చేశాయి. ‘చెల్లింపుల డేటా స్టోరేజి’పై ఆర్‌బిఐ 2018 ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేసింది. 2017 అమెరికాకు భారత్ 47.9 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు చేయగా, 26.7 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేసింది. వాణిజ్య తులన భారత్‌కే అనుకూలంగా ఉంది.