తల్లి తలను నరికిన తనయుడు
ప్రజాపక్షం/జనగామ ప్రతినిధి మానవత్వం మంట గలిసింది. ఆస్తి కోసం అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఓ కొడుకు ఆస్తి కోసం తల్లిని నరికి చంపిన ఘటన జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలోని మరిగడి గ్రామంలో జరిగింది. ఈ సంఘటన దావాలంగా వ్యాపించడంతో తల్లిని చంపిన క్రూరుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్‌పి సీతారామ్, ఎసిపి దేవేంద్‌రెడ్డి, సిఐ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాల్ని పరిశీలిస్తే జనగామ మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కురాకుల రమణమ్మకు
కొడుకు కన్నప్ప, కూతురు లావన్య ఉన్నారు. భర్త రాజయ్య గత పదేండ్ల క్రితమే మృతి చెందాడు. రమణమ్మకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొడుకు కన్నప్పకు పెళ్లి కాగా కొడుకు, కూతురు ఉన్నారు. రమణమ్మ కూతురు లావణ్య ఇటీవల భద్రాచలంకు చెందిన ఓర్సు సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం అన్న కన్నప్పకు ఇష్టం లేదు. అయితే ఉన్న 10 ఎకరాల భూమిలో రమణమ్మ కూతురు లావన్యకు 4 ఎకరాలు పట్టా చేసింది. ఈ విషయమై ఇంట్లో గొడవ జరగగా తల్లిని కొట్టడంతో గాయమైంది. హాస్పటల్‌లో చికిత్స పొంది బుధవారం రాత్రి ఇంటికి చేరుకుంది. మిగతా ఆరు ఎకరాల భూమి కూడా కొడుకు తెలియకుండా రమణమ్మ తన పేరు మీది రిజిస్టేషన్ చేసుకోనేందుకు ప్రయత్నం చేస్తుండగా కొడుకు కన్నప్ప గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. గురువారం ఉదయం మరిగడిలోని తన ఇంటికి చేరుకున్న కన్నప్ప తల్లితో గొడవ పడ్డారు. ఇద్దరి మద్య గొడవ తీవ్రం కావడంతో కోపోద్రిక్తుడైన కన్నప్ప చికెన్ కొట్టే కత్తితో తల్లి మొడ కోసం తల, మొండాన్నా వేరు చేశాడు. ఈ సంఘటన దావాలంగా వ్యాపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే పోలీస్‌కు సమాచారం ఇవ్వడంతో సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ రఘుపతితో కలిసి హుటాహుటిన మరిగడి చేరుకొని విచారించారు. డిసిపి సీతారామ్, ఎసిపి దేవేందర్‌రెడ్డి సందర్శించి పరిశీలించారు. మృతురాలు కూతురు లావన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నింధితుడు కన్నప్ప పోలీసుల అదుపులో ఉన్నారు.
చికెన్ కొట్టే కత్తితో నరికి చంపిన్న కన్నప్ప
రమణమ్మ కొడుకు కన్నప్ప గ్రామంలో చికెన్ సెంటర్ నడిపేవాడు. వారానికి ఒకటి, రెండు రోజులు చికెన్ విక్రయించేవాడు. చికెన్ కొట్టే కత్తితోనే తల్తి మెడ నరికాడు. కన్నప్ప అత్తగారు జనగామ పట్టణం కావడంతో బుధవారం రాత్రి జనగామలోనే ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం ఉదయం ఇంటికి చేరి పథకం ప్రకారం తల్లిని హత్య చేసినట్లు తెలుస్తుంది. ఆస్తి కోసం తల్లిని హత్య చేయడ దుర్మార్గమైన చర్య అని పలువురు మండిపడ్డారు.
పోలీసుల అదుపులో నిందితుడు
తల్లిని హత్య చేసిన నింధితుడు కన్నప్ప పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఎసిపి దేవేందర్‌రెడ్డి తెలిపారు. రమణమ్మ కూతురు లావన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. హత్య కోనాలపై మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా హాస్పటల్‌కు తరలించారు.
ఆస్తి కోసం అతిదారుణం
RELATED ARTICLES