టౌన్‌విల్లే శివార్లలో పల్టీ కొట్టిన కారు..
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రపంచ మేటి హార్డ్ హిట్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న సైమండ్స్ భారతీయులకు చిరపరచితుడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ‘మంకీ గేట్’గా క్రికెట్ ప్రపంచంలో ప్రచారమైన ఈ ఉదంతం ఒక రకంగా అతని కెరీర్‌ను దెబ్బతీసిందనే చెప్పాలి. లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ జోక్యం చేసుకొని, హర్భజన్ తప్పు లేదని, అతను హిందీలో వాడిన ‘మాకీ’ అనే పదాన్ని సైమండ్స్ తప్పుగా అర్థం చేసుకున్నాడని స్పష్టం చేయడంతో వివాదానికి తెరపడింది. అయితే, సచిన్ విమర్శలకు గురైన కారణంగానే సైమండ్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సరైన అవకాశాలు ఇవ్వలేదన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవాలు ఎలావున్నా, క్రికెట్ రంగంలోనే అసాధారణ ప్రతిభావంతుడైన ఆల్‌రౌండర్లలో ఒకడైన సైమండ్స్‌కు తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. అతని మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హర్భజన్ సింగ్‌సహా పలువురు క్రికెటర్లు అతని అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. సైమండ్స్ ప్రాణాలను హరించిన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కౌన్‌విల్లేకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని అలైస్ రివర్ బ్రిడ్జి సమీపంలోని హార్వే రేంజ్ రోడ్డుపై సైమండ్స్ నడుపుతున్న కారు
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం
RELATED ARTICLES