సిడ్నీ: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 34 పరుగులతో విజయం సాధించిన ఆస్ట్రేలియా మరో కొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డును కంగారూ జట్టు సొంతం చేసుకుంది. శనివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా తమ ఖాతాలో 1000వ అంతర్జాతీయ మ్యాచ్ విజయాన్ని వేసుకుంది. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లో నిలిచింది. ఆసీస్ జట్టు ఇప్పటి వరకు వన్డేల్లో (558), టెస్టుల్లో (384), టి20ల్లో (58) విజయాలు సాధించింది. 1877లో మెల్బోర్న్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి అంతర్జాతీయ విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు తాజాగా సిడ్నీలో భాతత్పై గెలిచి 1000వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లాండ్ ఇప్పటి వరకు (774) విజయాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. కాగా, భారత్ (711) విజయాలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా కొత్త చరిత్ర
RELATED ARTICLES