విజృంభించిన కమ్మిన్స్
తొలి టెస్టులో శ్రీలంక పరాజయం
బ్రెస్‌బోర్న్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 40 పరుగులతో ఘణ విజయం సాధించింది. భాతర్‌తో టెస్టు సిరీస్ కోల్పోయిన ఆసీస్ ఇప్పుడు శ్రీలంకను ఓడించి తిరిగి ఫామ్‌ను కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా గొప్ప విజయం సాధించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి సత్తా చాటుకుంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌటైన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పేలవమైన ఆటను ప్రదర్శించింది. ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ (6/23) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 40 పరుగులతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. లంక బ్యాట్స్‌మెన్స్‌లో లాహిరు తిరిమన్నే (32), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా (24), సురంగా లక్మాల్ (24) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్ తెలిపోయారు. కనీస పోరాటం కూడా చెయ్యకపోవడంతో లంకకు పరాజయం తప్పలేదు. శనివారం 17/1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ప్రత్యర్థి బౌలర్ కమ్మిన్స్ ధాటికి విలివిలలాడింది. కమ్మిన్స్ నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాట్స్‌మన్ హడలెత్తించాడు. దీంతో లంక 50.5 ఓవర్లలోనే 139 పరుగులకే ఆలౌటైపోయింది. విజృంభించి బౌలింగ్ చేసిన కమ్మిన్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1 ఆధిక్యం సాధించింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయం
RELATED ARTICLES