హాకీ ప్రపంచకప్ ఫైనల్లో బెల్జియం, నెదర్లాండ్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నెదర్లాండ్స్ షాకిచ్చి ఫైనల్లో దూసుకెళ్లింది. మరో సెమీస్‌లో బెల్జియం జట్టు ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. ఇక్కడి కళింగ స్టేడియంలో శనివారం జరిగిన రెండో సెమీస్ పోరులో ప్రపంచ నెంబర్‌వన్, వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నెదర్లాండ్స్ ఊహించని షాకిచ్చింది. ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ పూర్తి సమయం ముగిసే సరికి రెండు జట్టు చెరో రెండు గోల్స్ (2 సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ ఫలితం కోసం షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే షూటౌట్లో నెదర్లాండ్స్ 4- డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. దీంతో హ్యాట్రిక్ టైటిల్స్‌పై కన్నేసినా ఆస్ట్రేలియా కలలపై నీరుగారింది. 2014 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 1 తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన నెదర్లాండ్స్ ఈ సారి ప్రతీకారం తీర్చుకుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం 6 గోల్స్ తేడాతో ప్రపంచ ఏడో ర్యాంక్ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బెల్జియం ఏకపక్షంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుని టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆదివారం స్వర్ణం కోసం జరిగే ఫైనల్ పోరులో బెల్జియంతో నెదర్లాండ్స్ ఢీ కొననుంది. మరోవైపు కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ జట్టు తలపడనుంది.
ఆస్ట్రేలియాకు షాక్
RELATED ARTICLES