మెల్బోర్న్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో అరుదైన గుర్తింపు సంపాదించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతను డానిల్ మెద్వెదెవ్‌ను 7 2 6 తేడాతో ఓడించడం ద్వారా ‘డబుల్‌హ్యాట్రిక్’ నమోదు చేశాడు. తొమ్మిదోసారి ఈ టైటిల్‌ను అందుకున్న అతను, 2011, 2012, 2013 సంవత్సరాల్లో మొదటిసారి వరుసగా మూడు పర్యాయాలు టైటిల్ అందుకొని హ్యాట్రిక్ సాధించాడు. తిరిగి, 2019, 2020 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఓపెన్ రారాజుగా వెలిగిన అతను ఈ ఏడాది కూడా టైటిల్‌ను కైవసం చేసుకొని, రెండోసారి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఆరు పర్యాయాలు కాకుండా, 2008, 2015, 2016 సంవత్సరాల్లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అతనికి ఇక్కడ తొమ్మిదో టైటిల్. కెరీర్ మొత్తంలో 18వ గ్రాండ్ శ్లామ్. అతని ఖాతాలో వింబుల్డన్ (ఐదు), ఫ్రెంచ్ ఓపెన్ (ఒకటి), యుఎస్ ఓపెన్ (మూడు) టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా నాలుగు గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లోనూ టైటిల్‌ను కైవసం చేసుకున్న అతి కొద్ది మంది టెన్నిస్ దిగ్గజాల జాబితాలో జొకోవిచ్ ఇది వరకే చేరాడు. అంతేగాక, అమెచ్యూర్ ఎరాలోనేగాక, ఓపెన్ ఎరాలోనూ అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిళ్లను (తొమ్మిది) గెల్చుకున్న వీరుడిగా జొకోవిచ్ పేరు ఇప్పటికే రికార్డు పుస్తకాల్లోకి చేరింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో ‘హ్యాట్రిక్’
RELATED ARTICLES