వాషింగ్టన్ : భూమిపై గనుల తవ్వకాల వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, పర్యావరణం దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే భూమిపై అలా చేయడం కన్నా ఆస్టరాయిడ్స్ (గ్రహశకలాలు)పై మైనింగ్ (గనుల తవ్వకాలు) పర్యావరణానికి చాలా సురక్షితమని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చిచెప్పారు. నిజానికి ఇప్పటికే ఆస్టరాయిడ్‌పై గనుల అన్వేషణ కోసం వివిధ దేశాలు తమ స్పేస్‌క్రాఫ్ట్‌లను మోహరించింది. ఈ మధ్యనే జపాన్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా తన హయబుసా2 స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ర్యుగు అనే ఆస్టరాయిడ్‌పై రెండు రోవర్లను మోహరించింది. అలాగే మరో దేశానికి చెందిన రోవర్‌ను కూడా ఈ మధ్యనే దించింది. అలాగే హయబుసా2 స్పేస్‌క్రాఫ్ట్ కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇదే ర్యుగు గ్రహశకలంపై అడుగుపెట్టబోతున్నది. పైగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మరో ఆస్టరాయిడ్‌పై పరిశోధనల కోసం ఓస్టరిస్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇఎస్ఎ) సైతం ఆస్టరాయిడ్స్‌పై కన్నేసింది. ఆస్టరాయిడ్స్‌పై పెద్దమొత్తంలో ఖనిజాలు, గనులు వుంటాయన్నది శాస్త్రవేత్తల నమ్మకం.