శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ మాజీ చీఫ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం రోటీన్ చెకప్ కోసం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రాతో కలిసి ఆమె ఆసుపత్రికి వెళ్లారు. సోనియాగాంధీ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా ఏడు కిలోమీటర్లు యాత్ర చేసిన తరువాత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తిరిగి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి
ఆసుపత్రిలో చేరిన సోనియా చేరుకున్నారు. గత ఏడాది జూన్‌లో సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. జూన్ 12న సర్ గంగారాం ఆసుపత్రిలో చేరి జూన్ 20న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా, జోడో యాత్ర బుధవారం ఉదయం యుపిలోని మవికలాన్ నుంచి పునఃప్రాంభమైంది.
ఆసుపత్రిలో చేరిన సోనియా
RELATED ARTICLES