57 ఏళ్ల పైబడిన వృద్ధుల పింఛన్ సంగతి ఏంటి?
ఎన్నికల హామీ అమలుకు మోక్షం ఎప్పుడు?
ఎనిమిది నెలల క్రితమే అర్హులను గుర్తించిన అధికారులు
సూర్యాపేటబ్యూరో : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ రెండవ సారి అధికారంలోకి వస్తే 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇస్తున్న ఆసరా పింఛన్‌ను 57 ఏళ్ల వయస్సు నిండిన వృద్ధులకు కూడా ఇస్తామంటూ హామీ ఇస్తూ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందుపర్చింది. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం… రెండవసారి అధికారం చేపట్టడం కూడా చకచకా జరిగిపోయి 15 నెలలు గడిచిపోయింది. అయినా నేటికీ ప్రజలకు ఇచ్చిన హామీకి మోక్షం లేదు. ఆసరా పింఛన్ కోసం 57 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక హడాహుడి చేసిన ప్రభుత్వం.. గత జూన్‌లోనే 57 ఏళ్ల పైబడిన వృద్ధులను గుర్తించి జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ అర్హులను గుర్తించి నేటికీ ఎనిమిది నెలలు పూర్తి కావస్తు న్నా ప్రభుత్వం నుండి తీపి కబురు మాత్రం జాడలేదు. అండగకుండానే హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ తమకు ఇచ్చిన మాటను మరిచిపోవడంపై వృ ద్ధులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అధికారుల లెక్క ల ప్రకారం 2019 జనవరి మాసాంతం వరకు మొత్తం 1,34,620 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు ఆసరా పింఛన్లు పొందున్నారు. ఇందులో వృద్ధులు 45,400, వికలాంగులు 20,087, వితంతువులు 54,610, ఒంటరి మ హిళలు 6,694, గీత కార్మికులు 6,915, చేనేత కార్మికు 914 మంది ఉ న్నారు. వీరిలో వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ. 2016 ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందిస్తుండగా.. వికలాంగులకు రూ.3016 అందజేస్తుంది. ఇందుకోసం ప్రతి నెల రూ. 33 కోట్ల 61 లక్షల, 76 వేల 248లను మంజూరు చేస్తుం ది. వీటిని అధికారులు లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పోస్టాఫీస్‌ల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇంత వరకు భాగానే ఉన్నా సిఎం కెసిఆర్ గత ఎన్నికల ముందు తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రతి నెల అందజేసే ఆసరా పింఛన్ 57 ఏళ్లు నిండిన వృద్ధులకు కూడా అందిస్తామని ప్రకటించడంతో పాటు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందపర్చారు. తిరిగి అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఇచ్చిన హామీ మాత్రం నేటికీ అమలు చేయడం లే దు.
ఆసరా కోసం ఎదురు చూపు
RELATED ARTICLES