వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‌గా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ రంగరంగ వైభవంగా. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు బి సమర్పణలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ను చూస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపిస్తోంది. చిన్నప్పుడు ఇద్దరు గొడవపడి పెద్దయిన తరువాత కూడా అదే తరహాలో హీరో హీరోయిన్‌లు మాట్లాడకుండా ఉంటారు. అదే విధంగా ఒకరికొకరు ఆట పట్టించడం లాంటి సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్‌లో కామెడీతో పాటుగా యాక్షన్, సెంటిమెంట్‌ను సైతం చూపించడం జరిగింది. అయితే వైష్ణవ్ తేజ్ తన గత చిత్రాల కంటే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌లోని డైలాగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, సత్య, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఆసక్తికరంగా ‘రంగరంగ వైభవం’గా ట్రైలర్!
RELATED ARTICLES