బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములుంటే, తెలంగాణలో స్కీములుంటాయ్
108, అమ్మఒడి వాహనాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్ బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో స్కీములు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆశ కార్యకర్తల సెల్‌ఫోన్ బిల్లును ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన “108, అమ్మఒడి” మొత్తం 466 వాహనాలను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగులు సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హరీశ్ రావు ప్రసంగిస్తూ గతంలో అంబులెన్స్ సగటు సమయం 30 నిమిషాలు ఉంటే, ప్రస్తుతం 15 నిమిషాలకు తగ్గిందని, అంబులెన్స్ లను డైనమిక్ పొజిషన్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు స్లాబులుగా పెంచుతున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455 కు పెరిగిందని, గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉండగా, ప్రస్తుతం 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. అమ్మ ఒడి ద్వారా రోజుకు 4 వేల మందికి, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని తెలిపారు. కరోనా కాదు కదా దాని తాత వచ్చినా ఎదుర్కొనెలా రాష్ట్ర వైద్య రంగం పటిష్టమైందన్నారు.
‘ఆశా’ల సెల్‌ఫోన్ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది
RELATED ARTICLES