దేశంలో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంపు
న్యూఢిల్లీ : దేశమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వేళ పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఐదు రోజుల విరామం తరువాత దేశీయ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 84.45కు చేరింది. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచు తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌కు 25 పైసల చొప్పున పెంచాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.45గా ఉండగా, డీజిల్ ధర రూ. 74.63కు చేరింది. ముంబయిలో పెట్రోల్ధర రూ. 91.07గా ఉండగా, డీజిల్ ధర రూ. 81.34గా ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఢిల్లీలో ఇదే అత్యధిక పెట్రోల్ కాగా, ముంబయిలో గరిష్టంగా డీజిల్ ధరలు రికార్డు అయ్యాయి. దేశీయ చమురు సంస్థలు అయిన ఐఒసి, బిపిసిఎల్, హెచ్పిసిఎల్లు నెల రోజుల తరువాత ఈనెల 6వ తేదీన రోజువారీ ధరల సవరణను పునరుద్ధరించాయి. వరుసగా రెండు రోజులు పెట్రోల్ ధరలు పెరగడంతో మొత్తంగా పెట్రోల్‌పై లీటర్‌కు 49 పైసులు, డీజిల్‌కు 51 పైసులను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే దేశంలో ఇంధన ధర పెంపునకు కారణమని, చమురు విక్రయ సంస్థలు వెల్లడించాయి. కాగా, పెట్రోల్ ధరలు ఈనెల 7న గరిష్టంగా రూ. 84.20కి చేరింది. గతంలో ఢిల్లీలో అక్టోంబర్ 4, 2018న రూ. 84కు చేరింది. అదే రోజు డీజిల్ ధర కూడా ఎప్పుడూ లేనంతగా రూ. 75.45కు చేరింది. అదే విధంగా అక్టోబర్ 4, 2018న ముంబయిలో పెట్రోల్ ధర గరిష్టస్థాయికి చేరి రూ. 91.34గా నమోదైంది.
ఆల్‌టైమ్ రికార్డు
RELATED ARTICLES