HomeNewsBreaking Newsఆర్‌టిసిపై ‘పెట్రో’ భారం!

ఆర్‌టిసిపై ‘పెట్రో’ భారం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి
సమస్యల పరిష్కారానికి కార్మికుల ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ప్రజా రవాణ వ్యవస్థ ఆర్‌టిసి సంస్థ అభివృద్ధి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని మాజీ ఎంఎల్‌సి, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఆర్‌టిసికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు బడ్జెట్‌ లలో కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరో వైపు మళ్లీ భారీ ఎత్తున డీజిల్‌ ధరలు పెరుగతాయని, వాటి భారం ఆర్‌టిసి పైన పడబోతుందని ఆందోళన వ్యక్తం చేశా రు. ఆర్‌టిసి కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టిఎస్‌ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌,ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద గురువారం నిరసనదీక్ష చేపట్టారు. ఈ దీక్షను నాగేశ్వర్‌ ప్రారంభించి, ప్రసంగిస్తూ ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్‌టిసిపైన భారం పడుతుందన్నారు. ఆర్‌టిసి ప్రజా సదుపాయ సంస్థ అని, అలాంటి సంస్థపైన ప్రభుత్వం పన్నులు వేసి, చివరకు నష్టాలు వచ్చే ప్రాంతాలపై కూడా పన్నులు వేసి, సంస్థకు లాభాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి సంస్థకు రాష్ట్ర బడ్జెట్‌లో 2 శాతం పెట్టుబడి పెట్టాలన్నారు. ఆర్‌టిసిని లాభనష్టాలతో చూడొద్దని, ఇదొక మౌలిక సదుపాయం లాంటిదని అన్నారు. పివి నర్సింహారావు ఎక్స్‌ప్రేస్‌వే, అవుట్‌ రింగ్‌ రోడ్‌ వేశారని, దీనిని కూడా లాభనష్టాలుగా చూశారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్‌టిసి కార్మికులు తమ హక్కుల సాధనకు యూనియన్లు పెట్టుకోకపోతే, రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టుకున్నారన్నారు. కేంద్రం ఆర్‌టిసి ప్రైవేటీకరణకుఏకంగా చట్టాన్ని మార్పు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆర్‌టిసి సమ్మె సందర్భంగా చూశామని గుర్తు చేశారు. జెఎసి ఛైర్మన్‌ కె.రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్‌టిసి ఎండికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే గేటు వద్దనే అడ్డుకున్నారన్నారు. ప్రజలకు రోజూ వరాలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ కార్మీకులకు ఒక్క వరం కూడా ప్రకటించలేదన్నారు. సిఎం కోసం కలిసేందుకు అర్జీలు పెట్టుకున్నప్పటికీ సమయం ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కార్మిక నాయకులను దిగ్బందం చేయడం అన్యాయమన్నారు. కార్మికులను తగ్గించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తాము సాధించింది ఏమీ లేదని, వేధింపులు, కక్షసాధింపు చర్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఇక మరో పోరాటానిక సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఆర్‌టిసి జెఎసి వైస్‌ఛైర్మన్‌ కె.హన్మంత్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ తార్నాక హాస్పిటల్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలన్నారు. కన్వీనర్లు వి.ఎస్‌.రావు, కమాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. డబుల్‌ డ్యూటీ చేస్తే ఓవర్‌ టైమ్‌ను చెల్లించాలన్నారు. కో-కన్వీనర్లు బి. సురేష్‌, జి.అబ్రహాం,బి.యాదగిరి, కత్తుల యాదయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో నాయకులు ఎస్‌.సాయిరెడ్డి, డి.గోపాల్‌, కె.రామిరెడ్డి, మంగల, మజీద్‌, స్వాములయ్య, ఆర్‌.ఎన్‌.రావు, బి.హెచ్‌.రాంచందర్‌, జి.ఆర్‌.రెడ్డి, ఎం.నరేందర్‌, సి.చిన్నారెడ్డి, బి.శ్రీనివాస్‌గౌడ్‌, సి.హెచ్‌. సుదర్శన్‌గౌడ్‌, బి.చంద్రకళ, సి.హెచ్‌.నాగప్ప, కిషన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments