ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. గెలిచినా, ఓడినా ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ధనాధన్ షాట్లతో స్వేచ్ఛగా ఆడారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా బాగానే ఆడింది. డుప్లెసిస్ (45), కోహ్లీ (55), లోమ్రోర్ (54 నాటౌట్) చక్కగా బ్యాటింగ్ చేశారు. ముగ్గురూ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఈ జట్టు 181 పరుగులు చేసింది. బౌలర్లకు మంచి సహకారం లభిస్తున్న పిచ్‌పై ఈ స్కోరు చాలా ఎక్కువే అని నిపుణులు కూడా అన్నారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ఢిల్లీ బ్యాటర్లు తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగారు. సిరాజ్, హాజిల్‌వు్‌డ హసరంగ, హర్షల్ పటేల్ ఇలా ఎంత మంది బౌలర్లు మారినా సరే వాళ్ల దూకుడు మాత్రం తగ్గలేదు. ఓపెన్ ఫిల్ సాల్ట్ (87) అద్భుతంగా ఆడాడు. అతనితోపాటు రైలీ రూసో (35 నాటౌట్) కూడా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఢిల్లీ జట్టు విజయం వైపు చాలా వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో సాల్ట్ అవటైనా కూడా.. అక్షర్ పటేల్ (8 నాటౌట్)తో కలిసిన రూసో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి బౌలర్లు అందరూ తేలిపోయారు. ఒక్కరంటే ఒక్క బౌలర్ కూడా ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. కెప్టెన్ డుప్లెసిస్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బౌలర్లను మార్చాడు. అయినా సరే ఫలితం లేకపోయింది. అందరి బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన 17వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన రైలీ రూసో మ్యాచ్‌ను ముగించాడు. ఆ జట్టు 16.4 ఓవర్లలోనే 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ ఆటతీరు చూసిన ఫ్యాన్స్ అసలు ఇది ఢిల్లీ జట్టేనా? ఇన్ని రోజులు ఏమైంది? అంటూ షాక్ అవుతున్నారు.
ఆర్‌సిబిపై ఢిల్లీ సూపర్ విక్టరీ..
RELATED ARTICLES