న్యూఢిల్లీ: యుపిఎ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సమయంలో పాకిస్థాన్‌పై భారత్ మూడు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆ దాడులను ఆర్మీ రహస్యంగా ఉంచాలని కోరడంతో ఆవిషయం బయటకు పొక్కనివ్వలేదని వివరించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మోడీ హయాంలో మాత్రమే మొదటిసారి మెరుపుదాడులు జరగలేదని, మన్మోహన్‌సింగ్ హయాంలో మూడుసార్లు మెరుపుదాడులు జరిగాయన్నారు. ఈ దాడులు చేయాల వద్దా అన్నదానిపై స్పష్టత కోసం అప్పటి ప్రధాని మన్మోహన్‌ను ఆర్మీ సంప్రదించిందని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ దాడులను రహస్యంగా ఉంచాలని ఆర్మీ కోరిందని రాహుల్ వెల్లడించారు. ఆర్మీ చేపట్టిన మెరుపుదాడుల్ని ప్రధాని మోడీ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
ఆర్మీ కోరిక మేరకే ఆ విషయం బయటకు పొక్కనివ్వలేదు
RELATED ARTICLES