నియామకాల్లో పెనుమార్పులకు శ్రీకార
కొత్త విధానానికి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ:త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచేందకు వీలుగా ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను ప్రవేశపెట్టింటది. స్వల్పకాల వ్యవధికి పరిమితమయ్యేలా యువతను సైన్యంలోకి తీసుకోవడానికి ఉపయోగపడే ఈ కొత్త విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత ఆయన త్రివిధ దళాల అధిపతులతో మీడియా సమావేశం నిర్వహించా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘అగ్నిపథ్ పరివర్తన పథకానికి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపడం ద్వారా మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కింద భారతీయ యువత సాయుధ సేవల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది ’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానాన్ని అనుసరించి నాలుగేళ్ల పాటు యువతను భారత త్రివిధ దళాల్లో చేర్చుకునే అవకాశం ఉంటుంది. ‘అగ్నిపథ్’ కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం వీరికి ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజిని అందిస్తారు. అది నాలుగో సంవత్సరం నాటికి 6.92 లక్షలకు పెరగనుంది. ఇది కాకుండా రిస్క్ అలవెన్సులు, ఇతర అలవెన్సులు అందజేస్తారు. నాలుగేళ్ల సర్వీసు ముగిసిన తర్వాత యవతకు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో అందజేస్తారు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ పొందుతారు. అనంతరం వారికి ఎలాంటి పెన్షన్ ఉండదు. పెన్షన్ కు సంబంధించిన ప్యాకేజ్ మొత్తం ఒకేసారి అందిస్తారు. అంతేగాక, వివిధ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ ఇస్తారు. ‘అగ్నిపథ్’ కింద నియమితులైన చాలా మంది సైనికులు నాలుగేళ్ల తర్వాత పదవి నుంచి వైదొలుగుతారు. అయితే, కొంత మందిని మాత్రం కొనసాగిస్తారు. 17 సంవత్సరాల ఐదు నెలల నుంచి నుంచి 21 ఏళ్ల వరకు వయసుగల యువతకు ఇందులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి 10 వారాల నుండి 6 నెలల వరకు శిక్షణనిస్తారు. కనీస విద్యార్హత పది లేదా ఇంటర్ మీడియట్ . 90 రోజులలో అగ్నివీరుల మొదటి రిక్రూట్మెంట్ ప్రారంభమవుతుంది. సైన్యంలోని ఏ రెజిమెంట్‌లోనూ కులం, మతం, ప్రాంతం ఆధారంగా రిక్రూట్మెంట్ ఉండదు. దేశానికి తమ వంతు సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పథకం మంచి అవకాశం. స్వల్పకాలం సేవలు అందించి, ఆ తర్వాత ఇతరత్రా ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. నాలుగేళ్ల తర్వాత కూడా కొనసాగే అగ్నివీరులకు మాత్రమే పెన్షన్ ఉంటుంది. మిగతా వారికి ఏక మొత్తంగా చెల్లింపులు జరుపుతారు. కాబట్టి ఈ స్కీమ్ వల్ల సైనికుల జీతభత్యాల్లో పొదుపు సాధ్యమవుత
ఆర్మీలో ‘అగ్నిపథ్’
RELATED ARTICLES