HomeNewsNationalఆర్థికంగా కాంగ్రెస్‌ను కుంగదీసే యత్నం

ఆర్థికంగా కాంగ్రెస్‌ను కుంగదీసే యత్నం

బ్యాంకు ఖాతాల స్తంభనపై సోనియా, ఖర్గే ఆగ్రహం
బిజెపి తీరు తమ పార్టీకేగాక, ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్య
న్యూఢిల్లీ : తమ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఒక క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆరోపించారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తామన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్‌ నాయకు లు జైరామ్‌ రమేష్‌, ఎఐసిసి కోషాధికారి అజయ్‌ మాకెన్‌ తదితరులు మాట్లాడారు. తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్‌ చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తమ పార్టీకే కాదని మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన విరాళాలను వాడుకోకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్‌ బ్యాం కు ఖాతాల ఫ్రీజ్‌ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. బ్యాంకు ఖాతాల స్తంభన వల్ల తాము ఎలాంటి ప్రచారం పనులు చేయలేకపోతున్నామని, ఎన్నికల్లో పోరాడే తమ సామర్థ్యం దెబ్బతిన్నదని రాహుల్‌గాంధీ అన్నారు. అజయ్‌ మాకెన్‌ మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామన్నారు. పోస్టర్లు వేయించడానికి వీలులేని పరిస్థితులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజలకు తమకు మద్దతు ఇవ్వాలని అజయ్‌ మాకెన్‌ కోరారు. బిజెపితో సహా ఏ రాజకీయ పార్టీ ఆదాయపు పన్ను చెల్లించనప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్‌ చేశారని ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రజలు తమ పార్టీకి ఇచ్చిన విరాళాలను బిజెపి లూటీ చేస్తుందని, తమ ఖాతాల నుంచి బలవంతంగా రూ. 115.32 కోట్లు విత్‌డ్రా చేసుకుందని ఆరోపించారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేసి ప్రధాని, హోంమంత్రి కాంగ్రెస్‌పై క్రమినల్‌ చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమన్నారు. ఎవరిదైనా బ్యాక్‌ అకౌంట్‌ మూసివేసినా, ఎటిఎం కార్డు పని చేయకుండా చేస్తే జీవించగలరా.. ప్రస్తుతం తాము ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేకుండా బిజెపి కుట్రకు పాల్పడిందన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం వల్ల కాంగ్రెస్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదనేదే బిజెపి ఉద్దేశంగా కనిపిస్తోందని రాహుల్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాల్సిన సంస్థలు ఉన్నాయి కానీ, ఏమీ చేయడం లేదని సోనియాగాంధీ మండిపడ్డారు. అన్నారు. ప్రస్తుతం తలెత్తిన సమస్య చాలా చాలా తీవ్రమైనదని, ఇది కాంగ్రెస్‌పైనే కాకుండా మన ప్రజాస్వామ్యంపైనే ప్రాథమికంగా అత్యంత ప్రభావం చూపుతుందన్నారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ప్రధాని ఒక క్రమబద్ధమైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల నుండి సేకరించిన నిధులు స్తంభింపజేసి తమ ఖాతాల నుండి డబ్బును బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అయితే, ఈ అత్యంత సవాలు పరిస్థితులలో కూడా, ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ వైఖరి ఎంతో ప్రమాదకరమన్నారు. బిజెపి వేల కోట్ల రూపాయిలు విరాళాలుగా తీసుకుని.. కేవలం మా బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింపజేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలకు భారత్‌ పేరు గాంచిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన విషయం ప్రజలకు తెలిసిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిష్పక్షపాతమైన ఎన్నికలు తప్పనిసరన్నారు. ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలుండాలని ఖర్గే పేర్కొన్నారు. మోడీ పాలనలో భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను సీజ్‌ చేయడం ద్వారా ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని.. ఖర్గే అభిప్రాయపడ్డారు. ఎక్కడ చూసినా బిజెపి ప్రకటనలే కనిపిస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలు స్తంభిపజేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments