న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన రాష్ట్రపతి ఉత్తర్వును సవాలుచేస్తూ అత్యవసరంగా విచారించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కోర్టు తగిన సమయంలో విచారిస్తుందని చెప్పారు. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆగస్ట్ 12 లేక 13వ తేదీల్లో విచారణ చేపట్టాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ‘పిటిషన్‌లోని లోపాలను సరిచేశారా?’ అని ధర్మాసనం శర్మను ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు శర్మ సమాధానమిస్తూ ‘అభ్యంతరాలకు అనుగుణంగా సవరించానని, పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్ కూడా ఇచ్చిందని’ పేర్కొన్నారు. శర్మ ఇంకా ధర్మాసనానికి తన వాదన వినిపించుకుంటూ కొందరు కశ్మీరీలు, పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితికి వెళతానని అంటున్నారని కనుక విచారణ చేపట్టాలని కోరారు. అప్పుడు ధర్మాసనం ‘ఒకవేళ వారు ఐక్యరాజ్యసమితికి వెళితే ఆ అంతర్జాతీయ సంస్థ భారత రాజ్యాంగ సవరణను ఆపేస్తుందా?’ అని ఎదురు ప్రశ్నించింది. అంతేకాక ‘మీరు మీ శక్తిని వాదన కోసం కాపాడుకోండి’ అని హితవు పలికింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని సంప్రదించకుండానే రాష్ట్రపతి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారని, కనుక అది అక్రమమని శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల రద్దు చేశారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాకే ఆయన ఆ ఉత్తర్వులు జారీ చేశారు. బిజెపి సరారు ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును తేగా పార్లమెంటు మంగళవారం వాటిని ఆమోదించింది.ముందుగా రాజ్యసభే సోమవారం ఆమోదం తెలుపగా, లోక్‌సభ మంగళవారం మూడింట రెండు వంతు మెజారిటీతో ఆమోదించింది. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదం జడలువిదిలించకుండా చూసేందుకు ప్రభు త్వం జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల పటాన్ని పునర్లిఖించనుంది. ఇందుకు సహకరించాలని ప్రభుత్వం ఎంపీలను కోరింది.
ఆర్టికల్ 370 అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో!
RELATED ARTICLES