న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్‌కప్‌లో పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం లభించింది. శనివారం ఇక్కడ జరిగిన మెన్స్ కంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో చెందిన రజత్ చౌహన్, అభిషేక్ వర్మ, అమన్ సైనీలు 235 తేడాతో రష్యా ఆర్చర్లు ఆంటన్ బులీవ్, అలెక్సాండర్, పావెల్ క్రిలొవ్ టీమ్‌పై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో భారత ఆర్చర్లు జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, స్వాతి దుద్వాల్ 226 స్వల్ప తేడాతో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన లైలా అన్నిసన్, ఎల్లా గిబ్సన్, లూసి మాసన్ టీమ్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఈసారి ఆర్చరీ ప్రపంచకప్‌లో బారత ఆర్చర్లు పేలవమైన గేమ్‌తో తీవ్రంగా నిరాశ పరిచారు.
ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్‌కు కాంస్యం
RELATED ARTICLES