HomeNewsTelanganaఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం జాతీయ రహదారికి తొలగిన అడ్డంకులు

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం జాతీయ రహదారికి తొలగిన అడ్డంకులు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం (చౌటుప్పల్‌- అమన్‌గల్‌- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి , పలు ముఖ్యమైన రాష్ర్ట రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ర్ట రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అందజేశారు. ఆయా రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో మంగళవారం కలిశారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన భేటీలో రాష్ర్టంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల పనులకు సంబంధించిన వివిధ సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ర్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు. తొలుత రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర్‌ పార్ట్‌ చౌటుప్పల్‌- సంగారెడ్డి- పరిధిలో యూటిలిటీస్‌ (కరెంటు స్తంభాలు, భవనాల తదితరాలు) తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య
నెలకొన్న ప్రతిష్టంబనపై చర్చ సాగింది. యూటిలిటిస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వమే భరించాలని పది నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రాష్ర్ట ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంబన నెలకొంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్‌హెచ్‌ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆరా తీశారు. యూటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టినదెవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వం యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్‌లో టోల్‌ ఆదాయంలో సగం రాష్ర్ట ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌కు సంబంధించి భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సఆర్‌ ఐఎఫ్‌ (కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.
జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ముఖ్యమంత్రి కోరిన రహదారుల వివరాలు
1.మరికల్‌– 63 కి.మీ.
2.పెద్దపల్లి- కి.మీ
3.పుల్లూర్‌- ìల్గొండ-225 కి.మీ.
4.వనపర్తి- -110 కి.మీ.
5.మన్నెగూడ- కి.మీ.
6.కరీంనగర్‌- కి.మీ.
7.ఎర్రవెల్లి క్రాస్‌ రోడ్‌ కి.మీ.
8.జగిత్యాల- శ్రీరాంపూర్‌- కి.మీ
9.సారపాక- కి.మీ
10.దుద్దెడ క్రాస్‌రోడ్‌-63 కి.మీ.
11.జగ్గయ్యపేట- కి.మీ.
12.సిరిసిల్ల- కి.మీ
13.భూత్పూర్‌- (తెలంగాణ)- 166 కి.మీ.
14.కరీంనగర్‌- కి.మీ

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments