ఎంఎల్‌సి ఎన్నికల్లో ఆరు చోట్లా టిఆర్‌ఎస్ విజయకేతనం
మరో ఆరు స్థానాలు ఏకగ్రీవం
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్
రాష్ట్రంలో స్థానిక సంస్థల శాసనమండలి (ఎంఎల్‌సి) ఎన్నికల్లో ఆరు స్థానాల్లోనూ అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 12 స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు ఆరు స్థానాలో ఏన్నిక ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు నవంబర్ 30వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ ఆరు స్థానా ల్లో కూడా టిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థులు టి.భానుప్రసాద్‌రావు, ఎల్. రమణ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వంటేరు యాదవరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాతా మధు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎం.కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠల్ గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుప్రసాద్ రావుకు 584 ఓట్లు రాగా, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. మొత్తం 1324 ఓట్లకు గానూ 1320 ఓట్లు పోల్ కాగా, 1303 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. పోలైన ఓట్లలో 17 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1026 ఓట్లకు గాను 1018 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎంఎల్‌సి స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివనిగా అధికారులు తేల్చారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ గెలుపొందారు. టిఆర్‌ఎస్ అభ్యర్థికి 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థిపై తాతా మధు 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎంఎల్‌సి స్థానంలో మొత్తం 768 ఓట్లకు గాను 738 ఓట్లు పోల్ కాగా 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థి టిఆర్‌ఎస్ అభ్యర్థి దండె విఠల్ 666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 937 ఓట్లకు గాను 862 ఓట్లు పోలవగా టిఆర్‌ఎస్ అభ్యర్థి దండె విఠల్ మొత్తం 740 ఓట్లు, సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి 74 ఓట్లు రాగా, 48 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఇంతకు ముందే ఆరు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్తానాల్లో గెలిచిన అబ్యర్థుల వివరాలు :