ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సా గుతోంది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఆరు నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ నెలకొన్నది. సి కింద్రాబాద్, మహబూబ్‌నగర్, ని జామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోటీ కనబడుతున్నది. దాదాపు అదే స్థా యిలో కరీంనగర్, మల్కాజ్‌గిరి, అదిలాబాద్ నియోజకవర్గాల్లో కూడా మూ డు పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతున్నది.
సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గం పరిధిలోని అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా ఉండడం, ఆయన రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బిజెఎల్‌పి నేతగా పనిచేయడంతో రాష్ట్రస్తాయి నాయకునిగా గుర్తింపు ఉండడం కలిసివస్తుందని భావిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గం పట్టణ ప్రాంతం కా వడంతో మోడీ చరిష్మా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ లోక్‌సభ పరిధిలోని మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లకు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఉండడం, పార్టీ అధికారంలో ఉండడం, తండ్రి మంత్రిగా ఉండడం, ఎంఐఎం పార్టీ మద్దతునివ్వడం తదితర సానుకూల అంశాలతో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అంజన్ కుమార్ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపిగా ఎన్నిక కావడం, టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడం, టిఆర్‌ఎస్‌లో కొత్తగా చేరి టిక్కెట్ దక్కించుకోవడంతో పార్టీలో అసంతృప్తితో ఉండడం వల్ల తనకు గెలుపు అవకాశాలున్నాయని చెబుతున్నారు. బిజెపి సిట్టింగ్ ఎంపి దత్తాత్రేయకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి తో ఉన్న వారి ఓట్లు కూడా తనకు వచ్చే అవకాశాలున్నాయని అంజన్‌కుమార్ భావిస్తున్నారు.
ఇక నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత సిట్టింగ్ ఎంపి కావడం, బోనాల నుంచి బతుకమ్మ వర కు అన్ని పండుగలలో ఆ మో క్రియాశీల పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే విస్త్రత ప్రచారం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన ప్రచారాన్ని హోరెత్తించడంతో ఆయనకు సానుకూల పవనాలు వీస్తున్నాయంటున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎంపిగా పోటీ చేసిన అనుభవం ఉండడంతో పాటు మైనార్టీ ఓట్లు తన కు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఎంఎల్‌ఎగా పనిచేసిన వ్యక్తిగా సుపరిచితు లు కావడం, ఎన్‌ఎస్‌యు ఐ, యువజన కాంగ్రెస్‌ల క్యాడర్ ఆయనకు మద్దతు గా ఉండడం, టిఆర్‌ఎస్ అభ్య ర్థి మన్నెం శ్రీనివాస్‌రెడ్డి కొత్త అభ్యర్థి కావడంతో తనకు గెలిచేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కాగా టిఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి కొత్త అభ్యర్థే అయినప్పటికీ జిల్లాలో మంత్రి, మాజీ మంత్రులైన ప్రముఖులు ఉండడం వల్ల పార్టీ క్యాడర్ అంతా తన విజయానికి కృషి చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బిజెపి అభ్యర్థి డి.కె. అరుణ గురించి తెలియని వారు జిల్లాలో ఉండరు. ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించ డం, ఆమె స్వంత ఇమేజీతో పాటు బిజెపికి చెందిన సాంప్రదాయ ఓటు కలిసి వస్తుందంటున్నారు. టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి ఇటీవల బిజెపిలో చేరడం కూడా డి.కె.అరుణకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు.
మరో వైపు కరీంనగర్, మల్కాజ్‌గిరి, అదిలాబాద్‌ల లో కూడా అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనబడుతుం ది. టిఆర్‌ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ సిట్టిం గ్ ఎంపిగా ఉండడం, మొదటి నుంచి టిఆర్‌ఎస్‌కు పట్టున్న నియోజకవ ర్గం కావడంతో మెజారిటీ పెంచుకుంటామని, ఢిల్లీలో తరచుగా తెలంగాణ వాణిని వినిపించడం తనకు కలిసివస్తుందన్నారు. అయితే ఆ యన స్థానికేతరుడని ప్రత్య ర్థి పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన కరీంనగర్ పట్టభద్రు ల నియోజకవర్గం నుంచి కాం గ్రెస్ బలపరిచిన అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విజయం సాధించడంతో ఓటర్ల మనోగతం మారిందని, తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అ భ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆశిస్తున్నా రు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవ స్థానంలో ఉండడంతో ఈసారి తన గెలుపు కాయమని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ భావిస్తున్నారు.
ఆరు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ
RELATED ARTICLES