ప్రజాపక్షం / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్‌ఎంఇఎల్) (ఆప్‌మెల్) ఆంధ్రప్రదేశ్- మధ్య ఆస్తుల పంపకాల వివాదాల్లో చిక్కుముడిలా మారింది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలో సుమారు 209 ఎకరాల్లో విస్తరించి సంస్థ ఆప్‌మెల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ సంస్థ పెట్టుబడులతో విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర విభజన చట్టంలో ఆప్‌మెల్ సంస్థను 9వ షెడ్యూల్‌లో చేర్చి సింగరేణి అజమాయీషీకే అప్పగించడంతో ఎపి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. స్థానికత ప్రకారం ఆప్‌మెల్ సంస్థ తమకే చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుండగా, కాదు.. కాదు.. ఆప్‌మెల్ సంస్థకు వాస్తవ యజమాని తెలంగాణకు చెందిన సింగరేణి అని, ఇది 12వ షెడ్యూల్‌లో ఉడడంతో పాటు సింగరేణి పెట్టుబడులు ఇందులో ఉన్నందున ఇది తమదేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సింగరేణిలో 51 శాతం వాటా తెలంగాణాదే కాగా, 49 శాతం వాటా భారత ప్రభుత్వానిదే కావడం గమనార్హం. కాగా ఆప్‌మెల్ తమదేనని ఎపి వాదిస్తోంది. అందుకు 9వ షెడ్యూల్ సంస్థల విభజన కోసం షీలా బిడే కమిటీకి ఇచ్చిన సిఫారసులను ఆధారంగా చూపిస్తోంది. ఈ సంస్థపై ఎవరికి హక్కు, ఆధిపత్యం అన్న వివాదంపై గతంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసుకున్న ఉదంతాలు కూడా ఉండడం గమనార్హం. చిదంబరం నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ వ్యవహారం నివేదించిన ఘటనలు ఉన్నాయి.
ఆప్‌మెల్ ఎవరికి?
RELATED ARTICLES