– అత్యవసర సేవలకు కోవిడ్ కంట్రోల్ రూం
– ప్రజలనుంచి అద్భుతమైన స్పందన
ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆపదలో ఉన్న వారికి మేమున్నామని సైబరాబాద్ పోలీసులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సి సజ్జనార్, సూచనల మేరకు కోవిడ్ కంట్రోల్ రూమ్ కోసం ట్రాఫిక్ డిసిపి ఎస్ఎమ్ విజయ్ కుమార్,నేతృత్వంలో అడిషనల్ డిసిపి1, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, మరో ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు,9 మంది పోలీస్ కానిస్టేబుళ్లు 24 X 7 రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నారు. ఇంటి వద్ద క్వారంటైన్ నిబంధనలు, బయట సామాజిక దూరం(సోషల్ డిస్టెన్స్)పాటించకపోవడం,లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన,కరోనా పై సమాచారం ఇవ్వాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా,అత్యవసర సేవలు,నిత్యావసర వస్తువులకు, మెడికల్ ఎమర్జెన్సీ సేవలు పొందడంలో ఇతర సమస్యలపై ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయవచ్చు.ఈ నెంబర్లకు వాట్స్ఆప్ సదుపాయం కూడా ఉంది.ఈమెయిల్ covidcontrol@gmail.com.ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ప్రజలను కోరారు.
– సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ కు మెడికల్ ఎమర్జెన్సీ కింద వచ్చిన 8 మంది పేషంట్లను అంబులెన్స్ ద్వారా డయాలసిస్ కు తరలించడం జరిగింది.
– కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సాయం కోరిన 6 మంది ప్రెగ్నెంట్ మహిళలకు సంబంధిత స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు.
– కరోనా ఉందని వచ్చిన ఏడుగురు అనుమానితుల(సస్పెక్ట్ కేసులను) ను వైద్య పరీక్షల నిమితం క్వారంటైన్ కు తరలించడం జరిగింది.వీటితోపాటు రాచకొండ,హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల, మంచిర్యాల జిల్లా చెన్నూరు,వివిధ జిల్లాల నుంచి వచ్చిన 56 ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది.
నిత్యావసర వస్తువులకు సంబంధించి వచ్చిన 9 కాల్స్ రిజాల్వ్ అయ్యాయి.
మరికొన్ని చోట్ల ప్రజలు ఎక్కువ గుంపులుగా ఉండడం,వీధుల్లో క్రికెట్ ఆడడం వంటి ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది.
సైబరాబాద్ ట్రాఫిక్ వలంటీర్ల సహకారంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అనాథలు, నిరాశ్రయులు,పేదలు,ఆకలి తో ఉన్న వారిని గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ,వివిధ స్వచ్ఛంద సంస్థల సాయంతో రోజుకు సుమారు వెయ్యి మంది వరకూ ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.
అదే విధంగా హాస్టల్ల నిర్వహణ, యాజమాన్యల తీరుపై వచ్చిన 5 ఫిర్యాదులు పరిష్కరించారు.
పెంపుడు జంతువుల కి సంబంధించి ఆహారం,ఇతర అవసరాలకు సంబంధించిన 5 ఫిర్యాదులు అందగా పరిష్కారం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ,రహదారులపై జన సంచారం,పాసులకు సంబంధించి,గ్యాస్ సిలిండర్ సమస్యలు,అంతిమ సంస్కారాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు రావడంతో సమస్యలకు సంబంధిచి 2 ఫిర్యాదులు (ఉదాహరణకు గ్యాస్ రెగ్యులేటర్ పని చేయకపోవడం వంటి సమస్యలు) పరిష్కారం చేశారు.
పేదలకు సాయం అందించేందుకు పర్మిషన్ కోరుతూ అనేక కాల్స్ రావడం,
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు సరుకులు అమ్ముతున్నారని వంటి ఫిర్యాదు అందగా పోలీసులు చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకున్నారు.
ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు.