ప్రజాపక్షం/హైదరాబాద్: సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యాబోధన చేయాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలియజేసింది. నెల రోజుల నుంచి ఎపిలో ఆన్‌లైన్ విద్యాబోధనకు మంచి ఫలితాలు ఉన్నాయని, తాము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆన్‌లైన్ విద్యాబోధన చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎల్‌కెజి, ఆన్‌లైన్ విద్యబోధన ఉండదని చెప్పింది. ఒకటి నుంచి 5వ తరగతి వరకూ వారంలో మూడు రోజులు, రోజుకు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకూ గం టన్నర గంటలపాటు క్లాసులు ఉంటాయి. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఐదు రోజులపాటు రోజుకు రెండున్నర గంటలు, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రోజుకు 3 గంటలు చొప్పున వారంలో 5 రోజులపాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సం జీవ్‌కుమార్ హైకోర్టుకు తెలిపారు. లెవెల్ 1, లె వెల్ 2 కింద స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా పా ఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. సందేహాలు వస్తే స ఫోన్ ద్వారా సంబంధిత టీచర్‌కు విద్యార్థి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు. సం దేహాన్ని నివృత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. టీసాట్ ద్వారా బోధ న జరుగుతుందని, యూట్యూబ్‌లోనూ చూసుకు నే వీలుంటుందని చెప్పారు. విద్యాబోధ న పేరుతో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్, కరోనా సమయంలోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరుకులు పంపిణీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వేసిన పిల్స్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిల తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేసిం ది. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయాలన్నది విధాన నిర్ణయమని, దీనిపై జోక్యం చేసుకోలేమని, అయితే తమకు వచ్చే సందేహాన్ని లెవనెత్తుతున్నామని, సూచనలు చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లలు స్మా ర్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉంటుందని ప్రశ్నించింది. ఒక ఇంట్లో ఒక్క టీవీనే ఉంటే ఆ ఇంట్లోని ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్‌లు ఎలా జరుగుతాయని ప్రశ్నించింది. దూరదర్శన్, టీసాట్‌ల ద్వారా ఆన్‌లైన్ పాఠాలు చెప్పాలనే ప్రతిపాదన బాగానే ఉం దని, లెక్కల్లోనో, సైన్స్‌లోనో సందేహాలు వస్తే అప్పటికప్పుడే నివృత్తి చేయకపోతే ఆ తర్వాత విద్యార్థులకు అర్ధం కాదని వ్యాఖ్యానించింది. వి ద్యార్థులతో ఇంట్రాక్ట్ సెషన్ ఉంటేనే సందేహాన్ని నివృత్తి చేసుకునే వీలుంటుందని అభిప్రాయపడింది. ఆదిలాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లోని ట్రైబుల్ ఏరియాల్లోని విద్యార్థులు ఎంతమంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకోగలరని ప్ర శ్నించింది. ఆన్‌లైన్ విద్య పేరుతో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేసిన పా ఠశాలలపై అధికారులు చర్యలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ని ఫిర్యాదు వచ్చాయో, ఎన్నింటికి నో టీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నారో వివరించాలని కోరింది. బోయిన్‌పల్లిలో ఫీజుల గురించి అడిగేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై కూడా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 9 నుం చి 12 వ తరగతి వరకూ సిలబస్ తగ్గించి విద్యార్థులపై భారం లేకుండా ఆన్‌లైన్ విద్యాబోధన చేస్తున్నట్లు సిబిఎస్‌ఇ యాజమాన్యం చెప్పింది. వి ద్యార్థులు ఖాళీగా ఉండటం కంటే ఆన్‌లైన్ విద్యాబోధనతో ఏదో ఒక పనిలో చదువులో నిమగ్నం అవుతారని చెప్పింది. సిలబస్ తగ్గింపుపై పే రెంట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారా అని హైకోర్టు అడిగింది. పాఠశాలలు మూతపడినప్పు డు విద్యార్థులకు మఎధ్యాహ్న భోజనం లేక వి ద్యార్థులు ఇబ్బందులు ఎలా పడతారని మరో ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సమయంలో ప్రభుత్వం బియ్యం, పప్పు లు, నగదు ఉచితంగా ఇచ్చిందని గుర్తు చేసింది. ఆకలి సమస్య తలెత్తదని అభిప్రాయపడింది. పూర్తి వివరాలు సమర్పిస్తామని పిటిషనర్ న్యాయవాది చెప్పడంతో అందుకు హైకోర్టు సమ్మతించింది.
ఆన్‌లైన్ విద్యపై సందేహాలు తీర్చండి
RELATED ARTICLES