HomeNewsBreaking Newsఆనాటి సంబరమేది!

ఆనాటి సంబరమేది!

తీరు మారుతున్న పల్లె పండుగ
దంపుడు చప్పుళ్లు కరువు… పల్లెలకు పట్నం వంటకాల దిగుమతి
ప్రజాపక్షం/ ఖమ్మం మారిన పల్లె తీరుతో పాటే పల్లె పండుగ తీరు మారుతుంది. సంక్రాంతి అంటే ఊరంతా సంబురమే. బంధుమిత్రులతో పల్లెల్లో కొత్త వాతావరణం ఏర్పడేది. ఆత్మీయ పలకరింపులు వరుసలు కలుపుతూ సాగే సంభాషణ కుటుంబం గురించి ముచ్చట్లు వినబుద్ది అయ్యేది. సంక్రాంతి పండుగకు వారం, పది రోజుల ముందు నుంచే రొళ్లు ఖాళీ ఉండకపోయేవి. ఎటు చూసినా రోకళ్ల దంపుడు చప్పుళ్లు వినిపించేవి. పంటలు చేతికి రావడం వాటిని విక్రయించిన సొమ్ముతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ పండుగ శోభను సంతరించుకునేది. ఇక పిండి వంటల ఘుమఘుమలు, గ్రామ కూడళ్ల కబుర్లు, ఆటలు అబ్బో ఆ రోజులు వేరుగా ఉండేవి. ఇప్పటికీ, అప్పటికీ పల్లె పండుగ సంక్రాంతి సంబురాల్లో చాలా తేడా వచ్చింది. ఆ నవ్వుల్లో ఏదో తేడా కనపడుతుంది. ఆ పలకరింపుల్లో అప్యాయత కొరవడింది. అంతా కృత్రిమం. అప్పుడు పట్నం నుంచి వస్తే ఆరోగ్యం గురించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగే వారు. ఇప్పుడు ప్యాకేజీలు, ఇండ్లు లేదా స్థలాల కొనుగోలు గురించి మాత్రమే అడుగుతున్నారు. కుటుంబ సభ్యులని గురించి చాలా మంది అడగడం మరిచిపోతున్నారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారే క్రమం మరి తొందరపడుతున్నట్లు కనిపిస్తుంది. రెండు దశాబ్దాలుగా పల్లె తీరు అత్యంత వేగంగా మారుతూ వచ్చింది. పట్నం పొకడ పల్లె పై తీవ్ర ప్రభావం చూపింది. పండుగ అంటే బకెట్‌ బిర్యానీలు, బజారులో అమ్మే కేకులు, సెలవులు కావడంతో ఇంట్లోనే ఉండవచ్చునన్న భావన ప్రశాంతంగా ఛాటింగ్‌ చేసుకోవచ్చుననే పట్నం ఆలోచన
సంక్రాంతి పండుగ పూట పల్లెల్లోనూ కనిపిస్తుంది. రోళ్లు, రోకళ్లు ఈ తరానికి పురాతన వస్తువులే. పట్నం నుంచి ఆర్డర్లు పెట్టుకుని సంక్రాంతి స్పెషల్‌ అరిసెలు తెప్పించుకుంటున్నారంటే ఆశ్చర్యం కలుగక మారదు. మిల్లు పట్టిన గారెల పప్పు, ఫారం కోడి తప్ప పప్పు రుబ్బి చేసిన గారెలు, ఇంట్లో పెరిగిన కోడి మాంసం అద్దుకు తినే రోజులు పల్లెల్లోనూ కరువయ్యాయి. సంక్రాంతి పూట పండుగ పల్లెల్లో తమ ఇంట్లో జరుపు కోవాలనుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలు పడి పల్లెకు చేరుకుంటున్నారు కానీ పల్లె సంప్రదాయాలను పదిలం చేసుకోవాలన్న ఆలోచన మదిలో మెదలడం లేదు. వచ్చేటప్పుడే పట్నం నుంచి పిండి వంటలను ఆర్డర్లు చేయించి తేస్తున్నారు. ఇక గంగిరెద్దులు, హరిదాసులు ఇప్పుడు కనిపించడం లేదు. కూడళ్లలో కూర్చుని చెప్పే సామేతలు, పంటలు, పశువుల గురించిన ముచ్చట్లు జాడ లేదు. సెంటర్‌లో కూర్చుని సెల్‌ఫోన్లు గెలుకుతున్నారు తప్ప ఎదురెదురుగా కూర్చున్న నోటమాట నోచుకోవడం లేదు. పట్నం తీరు పల్లెలను ఆక్రమించిందని ఆనందపడాలో, తరతరాల పల్లె సంప్రదాయలు, ఆత్మీయతలు, పలకరింపులు కరువయ్యాయని బాధపడాలో అర్థం కానీ వైచిత్రి ఇది. పండుగ పూట పట్నం అయినా పల్లె అయినా ఆనాటి నవ్వులు మాత్రం లేవు. అంతా కృత్రిమమే. పండుగ తీరే కాదు మానవ జీవన గమనంలో వచ్చిన మార్పు భవిష్యత్తులో ఏవైపుకు…

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments