పేసర్ బుమ్రా
ముంబయి : ప్రస్తుత యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కరే స్పూర్తి. అతడి ఆటను ఆదర్శంగా తీసుకుని చాలా మంది యువ ఆటగాళ్లు క్రికెట్ రంగంలో అడుగులు వేశారు. అయితే ఏకంగా సచినే ఓ క్రికెటర్ ఆటను మెచ్చుకుంటే ఇంకేముంటుంది. ఆ క్రికెటర్ జన్మ ఫలించినట్టే. ఇటివలే ముగిసిన ఐపిఎల్ సీజన్ ముంబయి ఇండియన్స్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలిబంగ్ చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రశంసలు కురిపించిన వారిలో మాస్టర్ బ్లాస్టర్ కూడా ఉన్నాడు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. ముంబయి ఫైనల్ వరకు వచ్చి ట్రోఫీని అందుకోవడంలో బుమ్రా శ్రమ ఎక్కువగా ఉందని సచిన్ చెప్పాడు. సచిన్ వాఖ్యలపై బుమ్రా ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘నాకు మాటలు రావడంలేదు.. థ్యాంక్యూ సచిన్ సర్’అంటూ ట్వీట్ చేశాడు. ఎవరి క్రికెట్ చూసి క్రికెట్‌ను కెరీర్‌గా మారల్చుకున్నానో అతనే తన ఆటను మెచ్చుకోవడం తన సంతోషానికి హద్దులేకుండా పోయిందని బుమ్రా పేర్కొన్నాడు.
ఆనందానికి హద్దుల్లేవు
RELATED ARTICLES