ప్రజాపక్షం/హైదరాబాద్: తాను చెప్పినా వినడం లేదనే కోపంతోనే సిఎం కెసిఆర్ ఆర్‌టిసి కార్మికులను చర్చలకు ఆహ్వానించడం లేదని పిసిసి అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. సిఎం తన ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్‌టిసి కార్మికుల సమ్మె అంశంలో కోర్టు తీర్పుపై వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లాలని ముందుగానే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, కాదంటే అఖిలపక్షాన్ని ఆహ్వానించి తద్వారా సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న కెసిఆర్
RELATED ARTICLES