న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్ భాగంగా గురువారం రాత్రి పటిష్టమైన ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు చెరో ఐదు విజయాలతో ఈ రెండు జట్లు 10 పా యింట్లు సాధించాయి. అయితే రన్‌రేట్ పరంగా పటిష్టంగా ఉన్న ఢిల్లీ ప్రస్తుతం రెండో స్థానంలో నిలవగా.. ముంబయి మూడో స్థా నంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఆధిక్యం తో పాటు ప్లే ఆఫ్‌కు మరింతగా చేరవైతారు. ఈ సీజన్ ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వరుస విజయాలతో జో రుమీదున్న ఢిల్లీని వారి సొంతగడ్డపై ఓడించడం ముంబయికి అంత ఈజీ కాద నే చెప్పాలి. హ్యాట్రిక్ విజయాలతో క్యాపిటల్స్ జోరుమీదుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులపై వరుసగా విజయాలు సాధించి తమ ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. శిఖర్ ధావన్, పృథ్వి కొలిన్ మున్రో, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బ్యాట్‌తో చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు బౌలింగ్‌లో కసిగో రబాడా, ఇషాంత్ శర్మ, క్రిస్ మోరీస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కీమో పౌల్ విజృంభిస్తున్నారు. అందరూ కలిసి కట్టుగా రా ణించడంతో ఢిల్లీ జట్టు మరింత పటిష్టంగా మారింది. ఎలాంటి లక్ష్యాన్నైనా అందుకునేందుకు బ్యాట్స్‌మెన్‌లు సిద్ధంగా ఉంటే.. మ రోవైపు ఎలాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ప్రత్యర్థి జట్లను కట్టడి చేసేందుకు బౌలర్లు రెడీగా ఉన్నారు. సన్‌రైజర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు విఫలమైనా.. ఇక బౌలర్లు స్వ ల్ప లక్ష్యాన్ని సైతం కాపాడుకొని తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. మరోవైపు ముంబయి ఇండియన్స్ జట్టు కూ డా ఈసారి హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగింది. ఇప్పటికే మూడు సా ర్లు ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబయి మరో టైటిల్ వేటలో ఉం ది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి అన్ని విభాగాల్లో మంచి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థులకు సవాళ్లు విసిరేందుకు సిద్ధంగా ఉంది. బ్యాటింగ్‌లో డికాక్, రోహిత్ శర్మ, సుర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరోవైపు బౌలింగ్‌లో లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, బెహెరెన్‌డార్ఫ్, కృనాల్ పాండ్యలు మంచి ప్రదర్శనలు చేస్తు ముంబయికు గొప్ప విజయాలు అందిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఆర్‌సిబిను చిత్తు చేసిన ముంబయి ఇప్పుడు మరో విజయం కోసం తహతహలాడుతోంది. ఓవరాల్‌గా ముంబయి, ఢిల్లీ జట్లు మంచి ఫామ్‌లో ఉ న్నాయి. ఈ పటిష్టమైన జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్ హో రాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది. ఆధిక్య పోరులో విజ యం ఎవరికి వరిస్తుందో వేచిచూడాలి.
జట్ల వివరాలు: (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, కసిగో రబాడా, ట్రెంట్ బౌల్ట్, అక్షర్ పటేల్, క్రిస్‌మోరీస్, కొలిన్ మున్రో, హనుమా విహారి, కీమో పౌల్.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సుర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కిరణ్ పొలార్డ్, బెహెరెన్‌డార్ఫ్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.
ఆధిక్యం ఎవరిదో..?
RELATED ARTICLES