ప్రస్తుతం శ్రీలంక 259/3, న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కుశాల్ మెండీస్ (116 బ్యాటింగ్), అంజెలో మాథ్యూస్ (117 బ్యాటింగ్) అద్భుత అజేయ శతకాలతో శ్రీలంకను ఆదుకున్నారు. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను అసాధరణ బ్యాటింగ్‌తో గట్టెంక్కిం చారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీ లంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 259 పరు గులు చేసింది. అంతకుముందు లంక మొదటి ఇన్నిం గ్స్‌లో 282 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ జట్టులో ఓపెనర్ టామ్ లాథమ్ (264 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం 20/3 పరుగుల ఓవ ర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్స్ కుశాల్ మెండీస్, అంజెలో మాథ్యూస్ శుభారంభాన్ని అందించారు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరుబోర్డును ముందుకు సాగిం చారు. ఈ క్రమంలోనే వీరు నాలుగో వికెట్‌కి 97 బంతులో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ జంటను విడదీయడానికి కివీస్ బౌలర్లు ఎన్నో ప్రయ త్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ దశలోనే దూకు డుగా ఆడుతున్న మెండీస్ 89 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మరోవైపు శ్రీలంక జట్టు స్కోరు కూడా 33.4 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. ఒకవైపు మెండీస్ దూకుడుగా ఆడుతుంటే మ రోవైపు మాథ్యూస్ కుదురుగా ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మాథ్యూస్ కూడా 135 బం తుల్లో 4 ఫోర్ల సహాయంతో అర్ధ శతకం సాధించాడు. పిచ్ పై పాతుకుపోయిన ఈ జోడీని విరగొట్టేందుకు న్యూజి లాండ్ కెప్టెన్ తరచు బౌలర్లను మార్చుతూ ఎన్నో ప్రయ త్నాలు చేశాడు. కానీ అతనికి నిరాశే మిగిలింది. ఈ క్ర మంలోనే వీరు మూడో వికెట్‌కు 150 పరుగుల కీలక భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. ఆ కొద్దిసేపటికే లంక ఇన్నింగ్స్ 73.3 ఓవర్లలో 200 పరుగుల మైలురాయిని దాటింది. దూకుడుగా ఆడుతున్న మెండీస్ 215 బంతుల్లో 12 ఫోర్లతో శతకం సాధించి లంక ఇన్నింగ్స్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. మరోవైపు మాథ్యూస్ కూడా 248 బం తుల్లో 11 ఫోర్లతో సెంచరీ సాధించాడు. మంగళవారం ఆ ట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయంగా ఉండి తమ జట్టును 250 పరుగులను దాటించి లంకను ఓటమి నుంచి కాపాడారు. మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 102 ఓవర్లలో 259/3 పరుగులు చేసింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కుశాల్ మెండీస్ (116 బ్యాటింగ్; 287 బంతుల్లో 12 ఫోర్లు), మాథ్యూస్ (117 బ్యాటింగ్; 293 బంతుల్లో 11 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజే యంగా 246 పరుగులు జోడించారు. నాలుగో రోజు న్యూ జిలాండ్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక 37 పరుగులతో వెనుకబడి ఉంది. కివీస్ బౌలర్లలో సౌథికి 2, ట్రెంట్ బోల్ట్‌కు ఒక్క వికెట్ లభించింది.
ఆదుకున్న మెండీస్, మాథ్యూస్
RELATED ARTICLES