ఆడిలైడ్: 151/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్స్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఆదుకున్నారు. వీరిదరూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఒకవైపు తమ వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు పరుగులను రాబట్టుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న పుజారా 140 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మరోవైపు ఇతనికి తోడుగా రహానే కూడా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జంటను విడదీయడానికి కంగారు కెప్టెన్ ఎంతగానో ప్రయత్నించాడు. తరచు బౌలర్లను మార్చుతూ పోయినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే వీరు నాలుగో వికెట్‌కు 103 బంతుల్లో విలువైన 50 పరుగులు భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ కొద్ది సేపటికే భారత జట్టు కూడా 458 బంతుల్లో రెండు వందల పరుగుల మార్కును దాటి భారీ ఆధిక్యంవైపు ప్రయాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన రహానే ఈ ఇన్నింగ్స్‌లో ఫామ్‌లో రావడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పుజారాతో కలిసి రహానే కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వారికి తలనొప్పిగా మారిన ఈ జంటను విడదీయడానికి ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
ఆదుకున్న పుజారా, రహానే..
RELATED ARTICLES