తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 172/3
ఆస్ట్రేలియా 326 ఆలౌట్
రెండో టెస్టు
పెర్త్: భారత్, ఆలస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండు జట్లు తడబడుతూ నిలుస్తున్నాయి. ఒక సమయంలో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధిస్తే.. మరోసమయంలో భారత్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. రెండో రోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. పుజారా, రహానేలతో కలిసి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చేందుకు శాయశక్తులా శ్రమించాడు. శనివారం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు మరోసారి నిరాశపరిచినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (81 బ్యాటింగ్), అజింక్యా రహానే (51 బ్యాటింగ్) అర్ధ శతకాలతో రాణించి భారత్‌ను ఆదుకున్నారు. ఓపెనర్లు మురళీ విజయ్ (0), కెఎల్. రాహుల్ (2) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం చతేశ్వర్ పుజారా (24)తో కలిసి కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. 82 పరుగుల వద్ద పుజారా ఔట్ అవ్వడంతో భారత్ తిరిగి కష్టాల్లో పడింది. కానీ ఈ సమయంలో రహానే, కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. శనివారం ఆటముగిసే సరికి వీరిద్దరూ అజేయంగా క్రీజులో నిలుచున్నారు. ప్రస్తుతం భాతర్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 154 పరుగులు వెనుకంజలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో భారత్‌కు ఆధిక్యం సాధించే అవకశాలు మెరుగ్గానే ఉన్నాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇషాంత్ శర్మ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ జట్టులో హారిస్ (70), ట్రావిస్ హెడ్ (58), అరోన్ ఫించ్ (50), టిమ్ పైన్ (38) పరుగులతో రాణించారు.
ఆదుకున్న కోహ్లీ, రహానే
RELATED ARTICLES