ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు
ఖాళీ స్టేడియాలతో ఐపిఎల్-2020
ప్రస్తుత వన్డే సిరీస్‌కు ఎఫెక్ట్
న్యూ ఢిల్లీ : ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4,500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఇవాళ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు. ప్రయాణాలు చేయడం అంటే రిస్క్‌తో కూడుకున్న పనేనని ఆయన తెలిపారు.
ఐపిఎల్‌కు ఎదురు దెబ్బ..
ఇదిలా ఉంటే ఐపిఎల్ 2020పై కరోనా ప్రభావం గట్టిగా పడినట్లు అర్థమవుతోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది ఏపీఎల్ ను నిలిపివేసే అవకాశాలపై బీసీసీఐ చర్చలు జరుపుతుందట. ఐపిఎల్ 2020ని నిలిపివేసే అవకాశాలపై బిసిసిఐలో డిస్కషన్ జరుగుతందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. టీమ్ లకు నష్టపరిహారం విషయంపై శనివారం బీసీసీఐ చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కూడా… కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని బిసిసితో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది. హెల్త్ మినిస్ట్రీ సూచలను ఫాలో అవ్వాలని, బీసీసీఐతో సహా తాము అన్ని ఎన్ఎస్ఎఫ్ (జాతీయ క్రీడల సమాఖ్యలు)లను కోరామని స్పోర్ట్స్ సెక్రటరీ రాధే శ్యామ్ జులనియా తెలిపారు. క్రీడల యాక్టివిటీస్ తో సహా అన్నీ ఈవెంట్లలో ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోట హాజరవడంను నివారించాలని కోరామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ ను నిర్వహించకపోవడమే మంచిదని తాము నిర్వాహకులకు సూచించినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఐపీఎల్ నిర్వహించాలా వద్దా అని ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు మార్చి-14,2020న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వాల నుంచి..
కరోనా వైరస్ దృష్యా ఇప్పటికే పలు దేశాల ప్రజలకు జారీ చేసిన వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. వీసాల రద్దుతో ఏప్రిల్-15, 2020వరకు విదేశీ ప్లేయర్లు భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం లేదు. దీంతో విదేశీ ప్లేయర్లు ఐపిఎల్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు. షెడ్యూల్ ప్రాకారం.. మార్చి29న ముంబయి వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా దృష్యా ఈ ఏడాది ఐపిఎల్ రద్దు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపిఎల్‌ను వాయిదా వేయాలని, బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపిఎల్‌ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపిఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ భయంతో ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది.
ప్రేక్షకలు లేకుండా మిగతా రెండు వన్డేలు
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా గురువారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా బంతిపడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అటు అభిమానులు.. ఇటు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశకు గురికావాల్సి వచ్చింది. ఇక తదుపరి రెండు వన్డేలు లక్నో వేదికగా మార్చి 15న, కోల్‌కతాలో మార్చి 18న జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కరోనా సెగ తగిలింది. కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సూచనల మేరకు క్రీడాశాఖ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు స్ట్రిక్ట్ గ్్ైడ లైన్స్ జారీ చేసింది. ఏవైనా క్రీడా ఈవెంట్స్ వాయిదా వేయలేని పరిస్థితి ఉంటే జనసమూహం లేకుండా నిర్వహించాలని సూచించింది. దీంతో ప్రస్తుతం భారత్-, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఈ మార్గదర్శకాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే ఈ రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
ఆటలనంటిన కరోనా
RELATED ARTICLES