HomeNewsBreaking Newsఆటకు వీడ్కోలు చెబుతా..

ఆటకు వీడ్కోలు చెబుతా..

ఇదే నా చివరి సీజన్‌: సానియా
భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజనే (2022) తనకు చివరిదని ప్రకటించింది. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌..తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. సానియా మీర్జా అంతర్జాతీయంగా 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్‌ టైటిళ్లు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ విజేతగా సానియా మీర్జా నిలిచింది. ప్రస్తుతం ఆ స్ట్రేలియా ఓపెన్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే సానియా జోడీ ఓటమిపాలైంది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. ‘కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ ఓటమికి అవి కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్‌ అని మాత్రం చెప్పగలను. గతేడాది ఆఖర్లోనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. అయితే ఇప్పుడు నా వయస్సు 35. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యుఎస్‌ ఓపెన్‌ (జూన్‌ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్‌ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. అలానే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది. మూడేళ్ల కుమారుడిని నాతోపాటు విదేశాలకు తీసుకెళ్లడం కూడానూ రిస్క్‌తో కూడుకున్నదే” అని పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments