ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెడ్‌లో రాష్ట్రానికి నిధులు తగ్గడంతో ఆ ప్రభావం పథకాలపై పడే అవకాశముంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలకు నిధుల అవసరం తప్పని సరి. కేంద్రం ఆయా పథకాలకు ఇచ్చే నిధులను రాష్ట్ర పథకాలకు సర్దుబాటు చేసుకోవచ్చన్న అంచనాలో ఉన్న ప్రభుత్వానికి ఈ నిధులు సమకూరే మార్గం లేకుండా పోయింది. రాష్ట్రంలో రైతుబంధు, కెసిఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, గొర్రెలు పంపిణీ వంటి వివిధ సామాజిక, కుల సంఘాల సంక్షేమ పథకాలు, కంటి వెలుగు, షీ టీమ్ వంటి సామాజిక కార్యక్రమాల అమలు కోసం భారీగా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. క్రితం సంవత్సరం అంచనాలు తగ్గడం, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2019 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కుదించుకుని ప్రవేశ పట్టింది.
తగ్గిన రూ. 3,731 కోట్ల కేంద్ర నిధులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్‌ను చూసుకునే ముందు అడుగు వేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నన్ని నిధులు వస్తే ప్రకటించిన పథకాలకు కేటాయింపులు చేద్దామనీ భావించింది. కనీసం ఎంత లేదనుకున్నా కేంద్రం నుండి ఈ సారి రూ. 19,718 కోట్లు వస్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుని సిద్ధంగా ఉంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలవాటా రాజ్యంగ హక్కే. తెలంగాణ రాష్ట్రానికి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 19,718 కోట్లు రావాల్సి ఉండగా తాజాగా స వరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ. 15,987 కోట్లకు కేంద్ర ప్రభుత్వం కుదించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రావాల్సిన నిధుల్లో దాదాపుగా రూ. 3,731 కోట్లు తగ్గినట్లయింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లించడం ఆనవాయితీ. 2019- ఆర్థిక సంవత్సరంలో 18.9 శాతం తగ్గుదల రావడం గమనార్హం.
ఆగమాగం!
RELATED ARTICLES