రాష్ట్రంలో 24 గంటల్లో 1,717 పాజిటివ్‌లు
2,12,063కు చేరిన బాధితులు
తాజాగా మరో ఐదుగురు మృతి
1,222కు పెరిగిన మృతులు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. మరో ఐదు గురు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 1222 మంది చనిపోయారు. 2103 మంది కరోనా నుం చి కోలుకున్నారు. ఈ మేరకు శనివారంనాటి కరో నా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 ఉండగా జాతీయ స్థాయిలో 1.5 శాతం నమోదైంది. అలాగే కరోనా నుంచి కోలుకు న్న వారు రాష్ట్ర స్థాయిలో 87.29 ఉండగా జాతీయ స్థాయిలో 85.9 శాతంగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో 46,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1093 రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం 35,47,051 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. 2,12,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,85,128 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 25,713 యాక్టివ్ కేసులు ఉండగా, గృహ, ఇతర సంస్థలలో 21,209 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.
జిల్లాల వారీగా కొత్త కేసులు
శనివారంనాడు ఆదిలాబాద్‌లో 21, భద్రాద్రి-కొత్తగూడెంలో 87, జిహెచ్‌ఎంసిలో 276, జగిత్యాలలో 22, జనగామలో 21, జయశంకర్ భూపాల్‌పల్లిలో 15, జోగులాంబ గద్వాల్‌లో 16, కామారెడ్డిలో 34, కరీంనగర్‌లో 104, ఖమ్మంలో 82, కొమురంబీమ్ ఆసిఫాబాద్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 49, మహబూబాబాద్‌లో 32, మంచిర్యాలలో 21, మెదక్‌లో 23, మేడ్చల్-మల్కాజిగిరిలో 131, ములుగులో 19, నాగర్‌కర్నూల్‌లో 26, నల్లగొండలో 101, నారాయణపేట్‌లో 20, నిర్మల్‌లో19, నిజామాబాద్‌లో 53, పెద్దపల్లిలో 28, రాజన్న సిరిసిల్లాలో 22, రంగారెడ్డిలో 132, సంగారెడ్డిలో 59, సిద్దిపేటలో 85, సూర్యాపేటలో57, వికారాబాద్‌లో 18, వనపర్తిలో 21, వరంగల్ రూరల్‌లో 23, వరంగల్ అర్బన్‌లో 59, యాదాద్రి-భువనగిరిలో 27పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆగని కరోనా…
RELATED ARTICLES