HomeNewsAndhra pradeshఆంధ్రాలో పెరుగుతోన్న కరోనా కేసులు

ఆంధ్రాలో పెరుగుతోన్న కరోనా కేసులు

252కి చేరిన పాజిటివ్‌ కేసులు
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 53     తర్వాతి స్థానంలో 34తో నెల్లూరు  
ముగ్గురు మృతి
అప్రమత్తమైన అధికారులు
ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు

ప్రజాపక్షం/అమరావతి :ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరో నా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌నూ అతలాకుతలే చేస్తోం ది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు లాక్‌ డౌన్‌ కొనసాగుతోన్నా, మరో వైపు పాజిటివ్‌ కేసులు పెరగడం పట్ల అన్నింటా అప్రమత్తం అయ్యారు. ఇప్పటి వరకూ పాజిటివ్‌ కేసులతో ముగ్గురు మృతి చెందారు. విజయవాడ, మచిలీపట్నం, హిందూపురంలో కరోనా పాజిటివ్‌ కేసులతో మృతిచెందారు. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ హైటెన్షన్‌ నెలకొంది. ప్రభుత్వం ప్రతిరోజూ విడుదల చేసే హెల్త్‌ బులిటెన్లలోని గణాంకాలను చూస్తే గడచిన నాలుగు రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిం ది. ఇటీవల ఢిల్లీనుంచి వచ్చిన 969 మంది, వారి కుటుంబ సభ్యులు, వారిని కలిసిన వారిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఢిల్లీ నుంచి వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వారిని కలిసిన వారు కూడా ముందుకు రావాలని అధికారులు కోరారు. అయితే వారిలో కొంతమంది వైద్యపరీక్షలకు ముందుకు రావ డం లేదు. ఫలితంగా వారికోసం అధికారులు వెతుకుతున్నారు. ఇది పెద్ద సవాలుగా మారింది. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకొని, ప్రాణాపాయ స్థితికి చేరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్లడం,14 రోజుల పాటు అక్కడే ఉండటం అనేది ఇబ్బందిగా భావిస్తున్నారు. అక్కడ సరైన వసతులు ఉండవని, సమాజంలో తర్వాత చిన్నచూపు చూస్తారనే భావన ప్రజల్లో ఉంది. ఈవిషయంలో ప్రభుత్వం సరైన ప్రచారం చేసి, ప్రజల్లో చైతన్యం తీసుకురాలేకపోయింది. దీంతో ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు నెలకొన్నాయి.
నెల్లూరులో అధికం  : రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 252 పాజిటివ్‌ కేసులు నమోదు అయితే ఒక్క కర్నూలు జిల్లాలోనే 53 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత స్థానంలో నెల్లూరు 34,కేసులు నమోదు అయ్యా యి. అనంతపురంలో మూడు, చిత్తూరులో 17, తూర్పుగోదావరిలో 11, గుంటూరు 30, కడపలో 23,కృష్ణాలో 28,  ప్రకాశంలో 23, విశాఖపట్నంలో 15, పశ్చిమగోదావరిలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యా యి. విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఒక్క కేసుకూడా నమోదు కాలేదు.ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వవరకూ నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కేసులు ఉండ టం ఆందోళన కలిగేంచే అంశం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఐదుగురు పేషెంట్స్‌ రికరవీ అయి, డిఛార్జి అయ్యారు. ఇప్పటి వరకూ నమోదయిన కేసుల్లో విదేశాల నుంచివచ్చన వారు 11 మంది, వారి కాంటాకట్స్‌ ఆరుగురు, వైరస్‌ లక్షణాలతో చేరిన వారు మరో ఆరుగు రు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్‌ కేసుల పెరగడానికి ఢిల్లీనుంచి వచ్చిన వారి వల్లనే అని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా కొంత మందికి చేసిన వైద్య పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని, అవి వస్తే పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రార్థనలకోసం వెళివచ్చిన వారు, వారిని కలిసి వారు త్వరగా పరీక్షలు చేయించుకోవాలని సిఎం సూచించారు.దీనికోసం ప్రతిజిల్లాలోనూ కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురావాలని , ఇపుడున్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాలని ఆదేశించారు. ప్రతి ఇంటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని సూచించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిత్యవాసరాల కొరత : లాక్‌ డౌన్‌ నేపథ్యంలో నిత్యవాసరాల కొరత ఏర్పడింది. అధికారులు చెప్పేదానికీ , వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. నిత్యవాసరాలు హోల్‌ సేల్‌ నుంచ రిటైల్‌ కి రావడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కొన్ని రకాల నిత్యావసరాలు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీనితో పాటు సరుకులు కూడా అన్నిప్రాంతాలకు చేరవేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింతగా అధ్వాన్నంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు సరుకు వెళ్లే మార్గం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం అంతగా దృష్టిసారించలేదు.
మందులకొరత : లాక్‌ డౌన్‌ ప్రకటించిన రోజు నుంచి మెడికల్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి. అయితే వాటిల్లోకి కావాల్సినంత సరుకు రావడం లేదు. ముఖ్యంగా శానిటైజర్లు, మాస్క్‌ లకొరత తీవ్రంగా వేధిస్తోంది. మూడు రూపాయల విలువ చేసే మాస్క్‌ లను 25 రూపాయలకు అమ్మే పరిస్థితులు ఉన్నా వాటిన సరఫరా లేదు. శానిటైజర్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. వీటిపై డ్రగ్‌ నియంత్రణ శాఖ చేసే ప్రకటనలకూ, వాస్తవానికి అసలు పొంతనే లేకుండా పోయింది. ఎవరినీ నియంత్రించే పరిస్థితులు లేవు. దీంతో ఆయా షాపుల్లో దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments