సిఎం చైర్మన్గా వ్యవసాయ కమిషన్
కమిషన్ సభ్యులుగా నాగిరెడ్డి, అజయ్ కల్లం!
స్వామినాథన్ సిఫార్సుల అమలే ప్రధాన లక్ష్యం
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం పలు కీలక చర్యలు తీసుకుంది. సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటైం ది. గతంలో ఇలాంటి కమిషన్లు వేయడానికి కొంత ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేక పోయాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను రైతాంగానికి చేరువ చేయడం ద్వారా అధిక దిగుబడులను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్. స్వామినాథన్ నేతృత్వంలో అనేక సంస్కరణలు రూపొందించిన విషయం తెలిసిందే. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించ డం వంటి సిఫారసులను ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎంత వరకు అమలు చేశాయన్నది పక్కన పెడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, రైతాంగానికి గిట్టుబాటు ధరలు అందించడం కోసం పలు సూచనలు, సిఫారసులను చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్కు ఆ రాష్ట్ర సిఎం చైర్మన్గా ఉండటం వ్యవసాయ రంగంలో అపారమైన అనుభ వం కల్గిన సీనియర్ అధికారులు నాగిరెడ్డి, అజయ్ కల్లం వంటి వారిని కమిటీలో నియమించడం వ్యవసాయ రంగానికి చుక్కాని అవుతుందంటున్నారు.వ్యవసాయ రంగానికి సంబంధించి తొలకరి వానలు ఆశాజనకంగా లేక పోవడం, ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతాంగానికి తెలియజేసే విధంగా కృషి చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయంటున్నారు. మోన్సాంటో లేదా ఇతర కంపెనీల బ్రాండ్ పేర్లు వాడి నకి లీ విత్తనాలను రైతాంగానికి అంటగట్టే వారి పని పట్టేందుకు నిఘా ఉం చాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన విత్తనాలను వాడటంతో వచ్చే ప్రయోజనాలను రైతాంగానికి వివరించేలా చూడనున్నారు.