ప్రజాపక్షం / అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 5,783 మంది శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1259కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో 970 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా 40 కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో.. అనంతపురం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 17, వైఎస్‌ఆర్ జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలవరం
RELATED ARTICLES