2 పేజీలు మిగిలి ఉండగానే ముగిసిన బడ్జెట్ ప్రసంగం
న్యూఢిల్లీ: లోక్‌సభలో శనివారం 2020 ఆర్థిక సం వత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి ని ర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించారు. రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని నిలిపివేశారు. సుదీర్ఘ ప్రసంగం నేపథ్యంలో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. బిపి తగ్గడంతో నుదుటిపై చెమటలు కనిపించాయి. ఈ క్రమంలో ఆమె ఇబ్బంది పడ్డారు. తోటి మంత్రులు ఆమెకు చక్కెరను అందించినా ఆమె నిరాకరించారు. ప్రసంగాన్ని కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్‌ను అభ్యర్థించారు. మిగిలిన ప్రసంగాన్ని చదివినట్టుగా పరిగణించాలని పేర్కొన్నారు. బడ్జె ట్ ప్రసంగాల్లో తాజా బడ్జెట్ ప్రసంగమే సుదీర్ఘమైనది కావడం గమనార్హం. సుమారు ఆమె 2.40 గంటల పా టు ప్రసంగించారు. అంతకుముందు 2019 జులైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో సుమారు 2 గంటల 17 గంటల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును తాజాగా ఆమె అధిగమించారు. బడ్జెట్ ప్రసం గం అనంతరం లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ బడ్జెట్ పత్రాలను సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను సోమవారానికి చైర్మన్ వెంకయ్యనాయుడు వాయిదా వేశారు.
బడ్జెట్ ప్రసంగాలు ఎవరు.. ఎంతసేపు
స్వాతంత్య్రానంతరం మన పార్లమెంట్‌లో ఆర్థికమంత్రు లు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాల్లో కాలం మారుతున్న కొద్దీ ఎంతో వైవిధ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రెం డోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈసారి 2 గంటల 39 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివి మరో రికార్డును లిఖించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రులు ఎంతసేపు ప్రసంగించారో ఓసారి పరిశీలిస్తే..
F స్వాతంత్య్రానంతరం 1947 నవంబర్ 27న పార్లమెంట్‌లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆర్‌కె షణ్ముఖం చెట్టిదే. దేశ నిర్మాణమే లక్ష్యంగా ఆనాడు జాతి నిర్మాతలు రూపొందించిన ఆ బడ్జెట్ నిడివి 39 పేరాలు. ఆ తర్వాత వచ్చే బడ్జెట్‌ల నిడివి క్ర మంగా పెరుగుతూ వచ్చింది.
F మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 సమయం లో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ కీలక సమయంలో ఆయన బడ్జెట్ ప్రసంగం నిడివి 18,650 పదాలు. ఆ సమయంలో ఆయన చదివిన బడ్జెట్ ప్రసంగం నిడివే పెద్దది.
F వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ 2003లో బడ్జెట్ ప్ర వేశ పెట్టారు. ఆయన ప్రసంగం 2 గంటల 13 ని మిషాల పాటు సాగింది.
F మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన సమయంలో పార్లమెంట్‌లో ఎనిమి ది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేరాలు, పదాలు విషయంలో అరుణ్ జైట్లీ తర్వాత రికార్డు ఈయనదే. ఆయన బడ్జెట్ ప్రసంగాల్లో సగటున 202 పేరాలు ఉన్నాయి. 2012లో ఆయన ప్రవేశపెట్టిన బ డ్జెట్ ప్రసంగం నిడివి 220 పేరాలు ఉండగా.. చివరి బడ్జెట్ కూడా దాదాపు అంతే.
F కేంద్ర ఆర్థికమంత్రిగా పి. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగం లో సగటున 173 పేరాలు ఉన్నాయి. అత్యధిక సా ర్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రుల్లో మొరార్జీ దేశా య్ తర్వాతి స్థానం చిదంబరానిదే.
F 2018లో ఐదోసారి తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం 109 నిమిషాల పాటు కొనసాగింది. ఆ బడ్జెట్ ప్రసంగంలో 18,604 పదాలతో కూడిన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించా రు. అధిక పేరాలతో ఉన్న బడ్జెట్ ప్రసంగం చదివిన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. 2014లో 253 పేరాల తన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని 2గంటల 10 నిమిషాలు (అనారోగ్య కారణంగా నాలుగు ని మిషాల పాటు విరమించిన సమయాన్ని మినహాయిస్తే) పాటు చదివి వినిపించారు. 2015లో ఆయ న ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ప్రసంగం రెండు గం టల పాటు సాగగా 2017లో ఆయన ప్రసంగం 110 నిమిషాల పాటు సాగింది.
F 2019లో నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్ర సంగ పాఠం సమయం రీత్యా అతి పెద్దది. ఆమె ఉ ర్దూ, హిందీ, తమిళం.. ఇలా బహుభాషా పదాలతో గతంలో లోక్‌సభలో ఆమె చేసిన ప్రసంగం 2గంటల 17 నిమిషాల పాటు కొనసాగింది. 2003లో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ ప్రసంగంతో పోలిస్తే రెండు నిమిషాలు అధికంగా చదివి రికార్డు నెలకొల్పారు. ఈసారి (2020 ఏకంగా 2 గంటల 39 నిమిషాల పాటు తన ప్రసం గ పాఠాన్ని చదివి విన్పించి పార్లమెంట్‌లో అత్యధికంగా బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా అరుదైన రికార్డును నెలకొల్పారు నిర్మలా సీతారామన్.