పోటెత్తుతున్న వరదలు..
కొట్టుకుపోతున్న రోడ్లు
సాయం కోసం నిరాశ్రయుల ఎదురుచూపులు
డిస్‌పూర్: బీభత్సం సృష్టిస్తున్న అకాల వర్షాలు, వరదరలతో అసోం అల్లకల్లోలమైంది. వరదలు పోటెత్తుతున్న కారణంగా చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వేలాది మంది నిరాశ్రయులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వరద ఉధృతి రాష్ట్ర వ్యాప్తంగా 222 గ్రామాలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. కనీసం 57,000 మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది. తాగునీరు, ఆహారం లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటి వరకూ 1,434 పశువులు గల్లంతయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యా. స్థూలంగా చూస్తే 15 రెవెన్యూ ప్రాంతాల్లో పది వేలకుపైగా హెక్టార్లలో వంటలు నాశనమయ్యాయి. పంట భూములు దెబ్బతిన్నాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న దీమా హసావ్ జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. హాఫ్లాంగ్ ప్రాంతాల్లో రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన రైల్లే శాఖ పలు సర్వీసులు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. వరదల కారణంగా చిక్కున్న రెండు రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి.
అసోం అల్లకల్లోలం
RELATED ARTICLES