70 మందికిపైగా గల్లంతు
సహాయక చర్చలు ముమ్మరం
జొర్హాట్ (అసోం) : అసోంలో బుధవారం రెండు ప్యాసింజర్ పడవలు ఢీకొన్న సంఘటనలో కనీ సం 70 మంది గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారని, 50 మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారని తెస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అసోంలోని బ్రహ్మపుత్రా నది జొర్హాట్ నిర్మల్ ఘాట్‌కు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పడవ బ్రహ్మపుత్రా నదిలోని మజూలీ నుంచి నిర్మల్ ఘాట్‌కు వస్తున్నది. మరో పడవ నిర్మల్ ఘాట్ నుంచి వ్యతిరేక దిశలో వెళుతున్న ది. ప్రయాణికులతో కూడిన ఈ రెండు పడవలు ఢీకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలుగానీ, ఎంత మంది మృతి చెందారు లేదా గల్లంతయ్యారనే వివరాలుగానీ తెలియడం లేదు. ఒకరు మరణించినట్టు చెబుతున్నారు. వంద మందికిపైగా గల్లంతయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గల్లంతైన వారి సంఖ్య సుమారు 70 మంది వరకూ ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, సంఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అసోంలో 2 పడవలు ఢీ
RELATED ARTICLES