ప్రజాపక్షం/హైదరాబాద్ : శాసనసభ మొదటి సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. శాసనసభ సమావేశాలను ఈనెల 17న ఉదయం 11.30 గంటలకు, అలాగే 19న ఉదయం 11.30 గంటలకు శాసనమండలి సమావేశాలను నిర్వహించనున్నట్లు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరుతో సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. కాగా 16న ఉదయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎంఎల్‌ఎ ముంతాజ్‌ఖాన్‌తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 17న శాసనసభలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అసెంబ్లీ, సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల
RELATED ARTICLES