సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా
నల్లగొండ సభలో మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా?
ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రి రేంత్‌రెడ్డి సవాల్
ప్రజాపక్షం/హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అని ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తమప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. సభకు రాకుం డా కెసిఆర్ పారిపోయారని విమర్శించారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధమని, గురువారం సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నామని, కెసిఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా బిఆర్ఎస్ సభ్యులు కడియం శ్రీహరి మాట్లాడిన సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రసంగించారు. కెసిఆర్‌కు నిజాయితీ ఉంటే సభకు వచ్చి చర్చ చేయాలని అన్నారు. కెసిఆర్ నల్లగొండ సభలో మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా? ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘కాళేశ్వరానికి ఏం పీకనీకి పోయారు’ అనడం సబబా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారలేదు. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కెసిఆర్ పారిపోయి ఫామ్‌హౌస్‌లో దాకున్నారు. కెసిఆర్ నిన్న మాట్లాడింది ఏం భాష? ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళాడు అని అంటా రా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ ప్యాంటు లాగారు. ఇక జనం కెసిఆర్ చొక్కా కూడా లాగేస్తారు. సభకి రావాల్సిన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా ముఖ్యమంత్రిని తిడుతాడా?, మా ప్రభుత్వమే తప్పు చేసినట్టు గత ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వృథా అయ్యాయి’ అని సిఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా?
కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపై నిర్ణయం తీసుకునేలా చర్చించేందుకు కెసిఆర్ సభకు రావాలని సిఎం రేవంత్ సవాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టుపై శ్వేతపత్రం పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షం అభిప్రాయాలు శ్వేతపత్రంపై చర్చలో చెప్పుకోవచ్చని చెప్పా. కాళేశ్వరంపై ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. సాగునీటి పారుదల శాఖను చూసిన కెసిఆర్, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తామన్నారు. మేడిగడ్డలో ఎలా నీరు నింప్పుతారో ఎత్తి చూపించాలన్నారు.
సిఎం వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎల అభ్యంతరం
అయితే ముఖ్యంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎలు అభ్యంతరం తెలిపారు. సిఎంగా నిండు సభలో మాట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదు అంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ సిఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై శ్వేత పత్రం విడుదల చేస్తే చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. సిఎం భాష పట్ల తమకు అభ్యంతరం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను చీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు.
సభ నుంచి బయటకు వచ్చిన బిఆర్ఎస్ ఎంఎల్ఎలు
సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న క్రమంలో బిఆర్ఎస్ ఎంఎల్ఎలను మార్షల్స్, పోలీసులు అపారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుక అనుమతించరని నిబంధనల్లో ఉన్నదని బిఆర్ఎస్ ఎంఎల్ఎలకు పోలీసులు స్పష్టం చేశారు.
రేపటి వరకు అసెంబ్లీ?
శాసనసభ సమావేశాలు మరో రెండు రోజు ల అదనంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతం లో ఈ నెల 13వ తేదీ వరకు సమావేశాల షెడ్యూలును బిఎసి ఖరారు చేసింది. అయితే, 13న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు సభ్యులు వెళ్లడంతో, ఆ రోజు జరగాల్సిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ బుధవారం(14న) జరిగింది. అయితే డిప్యూటీ సిఎం,ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు అంత్యక్రియల్లో ఉండడంతో, చర్చకు సమాధానం ఇచ్చేందుకు అందుబాటులో లేరు. దీంతో బడ్జెట్ చర్చపై గురువారం సమాధానం ఇవ్వనున్నారు. ఇదే రోజు కుల గణనపై శాసనసభ తీర్మానం చేసే అవకాశం ఉన్నది. ఈ నెల 16న శాసనసభలో కృష్ణా,గోదావరి ప్రాజెక్టులపై ప్రభు త్వం శ్వేత పత్రం ఇచ్చే అవకాశం ఉన్నది.
అసెంబ్లీకి రాకుండా కెసిఆర్ పరార్
RELATED ARTICLES