హన్మకొండలో యువతిని చంపిన నిందితుడు అరెస్ట్
వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్
వరంగల్ బ్యూరో : మరొక యువకుడితో చనువుగా ఉంటున్న కారణంగా లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల హారతిని హత్య చేసిన నిందితుడు మహ్మద్ షాహిద్ అలియాస్ చోటును శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ వివరాలను వెల్లడిస్తూ హత్యకు గురైన మృతురాలు హారతి హత్యకు పాల్పడిన నేరస్థుడు మహ్మద్ షాహిద్ అలియాస్ చోటు వరంగల్ జిల్లా కాజీపేట విష్ణుపురి ప్రాంతానికి చెందినవాడని, అతడి తండ్రి రజాక్, విష్ణుపురి ప్రాంతంలో మటన్ వ్యాపా రం నిర్వహించేవాడని తెలిపారు. నిందితుడు మహ్మద్ షాహిద్ 2016 హంటర్‌రోడ్డులోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. నిందితుడు డిగ్రీ చదివే సమయంలోనే నిందితుడికి ఇదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన మృతురాలు మునిగాల హారతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొద్దిరోజుల అనంతరం మృతురాలు, నిందితుడి మధ్య స్నేహం కుదిరింది. క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొద్దికాలం ఇద్దరు కలిసి తిరగడంతో పాటు హారతితో కలిసి పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. షాహిద్ డిగ్రీ పూర్తి చేయడంతో గత ఆరునెలల క్రితం బ్యాంకు ఉద్యోగాల కోచింగ్ తీసుకుంటున్నట్లుగా చెప్పి హన్మకొండలోని రాంనగర్(క్రాంతినగర్) ప్రాంతంలో గది అద్దెకు తీసుకొని అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. ఇదే గదికి మృతురాలు కూడా అప్పుడప్పుడు వస్తుండేది. కొద్దిరోజుల క్రితం హారతి శివనగర్ ప్రాంతానికి చెందిన సుకుమార్ అనే యువకుడితో పరిచయమైంది. దీంతో గత కొద్దిరోజుల నుండి హారతి షాహిద్‌తో గతంలో మాదిరిగా చనువుగా ఉండకపోవడంతో అనుమానం వచ్చిన నిందితుడు షాహిద్ హారతిని పలుమార్లు ప్రశ్నించడంతో ‘నిన్ను తప్ప మరేవరిని ప్రేమించలేదని, నిన్నే ప్రేమిస్తున్నానని’ మృతురాలు షాహిద్‌కు తెలపడం జరిగింది. రెండు రోజుల క్రితం మృతురాలు సుకుమార్‌కు మేసేజ్‌లు పంపడాన్ని గమనించిన నేరస్తుడు మృతురాలు హారతిని గట్టిగా అడగడంతో మృతురాలి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిందితుడు మరో యువకుడైన సుకుమార్ ఇంటి చిరునామా కనుగొని అతని ఇంటికి వెళ్లి అతనిని ప్రశ్నించడంతో తాను మృతురాలు హారతిని ప్రేమిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇదే విషయమైన నిందితుడు షాహిద్ మృతురాలు హారతిని గట్టిగా ప్రశ్నించడంతో మృతురాలు హారతి సుకుమార్‌ను ప్రేమిస్తున్నట్లుగా తెలపడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు హారతిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు షాహిద్ హారతిని హత్య చేయాలనే రూపొందించుకున్న ప్రణాళికతో భాగంగా నిందితుడు నిన్నటిరోజు(శుక్రవారం) ఉదయం అదే రోజు మధ్యాహ్నం కలుసుకుందామని సెల్‌ఫోన్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని మృతురాలికి పంపడంతో మృతురాలు హారతి నిన్నటి రోజున మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నయీంనగర్‌లోని మూడు చింతల ప్రాంతంలో నిందితుడు షాహిద్‌ను కలుసుకుంది. కొద్దిసేపు మాట్లాడుకుందామని నిందితుడు షాహిద్ మృతురాలు హారతిని తన ద్విచక్రవాహనంపై రాంనగర్ ప్రాంతంలోని అద్దె గదికి తీసుకువెళ్లాడు. ఈ విధంగా నిందితుడి గదికి వచ్చిన మృతురాలు హారతి నిందితుడి మధ్య మాట, మాట పెరిగిపోవడంతో పాటు తనను మరిచిపోమ్మని, నేను సుకుమార్‌ను వివాహం చేసుకుంటానని మృతురాలు నిందితుడితో ప్రాధేయపడింది. దీంతో అప్పుడు నిందితుడు నమ్మినట్లుగా నమ్మకంగా నటించి మృతురాలు హారతిని మోసపూరితగా లొంగదీసుకొని ఆమెను కత్తితో గొంతుకోసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు గదికి తాళం వేసి రక్తపు మరకలతో విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు. హారతిని హత్య చేసింది తానే అని పోలీసులు గుర్తిస్తారని నిందితుడు లొంగిపోయేందుకు సెంట్రల్ జైలుకు చేరుకొని అక్కడ ఉన్న వ్యక్తితో తాను చేసిన హత్య గురించి వివరించడంతో సదరు వ్యక్తి సుబేదారి పోలీసుల ఎదుట లొంగిపోవాలని తెలపడంతో నిందితుడు ఆటోలో శుక్రవారం సాయంత్రం సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఇన్స్పెక్టర్ ముందు లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హత్య జరిగిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు కొనసాగించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడి నుండి ఒక ద్విచక్రవాహనం, రక్తం మరకలతో ఉన్న బట్టలు, కీచైన్ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
అసూయతోనే హారతి హత్య
RELATED ARTICLES