సుప్రీంకోర్టుకు తెలిపిన సివిసి
న్యూఢిల్లీ: తనను అధికారం నుంచి తప్పించి సెలవుపై పంపిన కేంద్ర ప్ర భుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ సిబి ఐ డైరెక్టర్ అలోక్ వర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ‘అసాధారణ పరిస్థితుల్లో అ సాధారణ పద్ధతులు అవసరం’ అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపిం ది. ‘ఆశ్చర్యకర, అసాధారణ పరిస్థితుల్లో సిబిఐపైన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు అధికారం ఉం టుందని, సిబిఐ పాలక చట్టాలు, సుప్రీం ను సివిసి తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ‘జూలైలోనే ఈ అసాధారణ పరిస్థితులు తలెత్తాయని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధ ర్మాసనానికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ చె ప్పారు. ‘సంస్థ ప్రయోజనాల మేరకే ప్రభుత్వ చర్య ఉండాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. సిబి ఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాలకు మధ్య ఏర్పడిన పోరు రాత్రికి రాత్రే తలెత్తింది కాదు అని కోర్టు అభిప్రాయపడింది. సె లెక్షన్ కమిటీని సంప్రదించకుండానే సిబిఐ డైరెక్టర్ అధికారాలను ప్రభుత్వం ఉపసంహరించేలా ప్రభుత్వాన్ని బలవంతపెట్టినట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సిబిఐ ఉన్నతాధికారులు కేసులను దర్యాప్తు చేయడానికి బదులు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కేసులను దర్యాప్తు చేయడం మొదలెట్టారు’ అని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. విచారించాల్సిన పరిధి సివిసికి ఉందని, ఒకవేళ విచారించకుంటే విధుల నుంచి తప్పించుకున్నట్లు అవుతుంది అని ఆయన చెప్పారు. సివిసి సరిగా వ్యవహరించలేకపోతే భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుందన్నా రు. ‘సివిసి దర్యాప్తు చేపట్టినప్పటికీ కొన్ని నెలలపా టు వర్మ దస్తావేజులు ఇవ్వలేదు’ అని మెహతా చె ప్పారు. అస్తానా తరఫున హాజరైన సీనియర్ న్యా యవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ ఈ కేసులో రాకేశ్ అస్తానా విజిల్‌బ్లోయర్‌గా వ్యవహరించారని, కానీ ప్రభుత్వం ఒకే కుంచెతో రంగు పులిమిందని అన్నారు.
సిబిఐ డైరెక్టర్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వు
తన అధికారాలన్నీ తీసేసి, సెలవుపై పంపిన కేం ద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ సిబిఐ డైరె క్టర్ అలోక్ వర్మ పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకో ర్టు గురువారం తీర్పును నిలిపి(రిజర్వులో) ఉం చింది. వర్మ, కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ వాదన లన్నీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విన్నది.
అసాధారణ పద్ధతులు అవసరం
RELATED ARTICLES