తటస్థ వ్యక్తి అయిన స్పీకర్ ఎందుకు కోర్టును ఆశ్రయించారు
రాజస్థాన్ స్పీకర్ జోషిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజస్థాన్ అసమ్మతి ఎంఎల్ఎలపై హైకోర్టులో ఉన్న కేసుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తటస్థ వ్యక్తి అయిన స్పీకర్ ఎందుకు కోర్టును ఆశ్రయించారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కాంగ్రెస్ అసమ్మతి నే సచిన్ పైలట్‌తో పాటు 19 మంది ఎంఎల్ఎలు అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పూర్తి స్థాయి చర్యలు తీసుకోకముందే.. వారు కోర్టుకు వెళ్లడాన్ని స్పీకర్ జోషీ సుప్రీంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రెబల్స్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తన తీర్పును వెలువరించేందుకు మార్గం సులువైంది. ఓ నేత ఇతరులపై విశ్వాసం కోల్పోయినా.. ఒకవేళ వారు ఆ పార్టీలోనే ఉంటే వారిపై ఎలా అనర్హత వేటు వేస్తారని జస్టిస్ ఎకె మిశ్రా అడిగారు. ఇలా చర్యలు తీసుకుంటే అదే అలవాటుగా మారుతుందని, అప్పుడు వారు తమ స్వరాన్ని వినిపించలేరని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాన్ని ఇలా నొక్కిపెట్టలేమని జస్టిస్ మిశ్రా అన్నారు. స్పీకర్ జోషీ తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదించారు. పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరకాలేదనే రెబల్ ఎంఎల్ఎలకు నోటీసులు జారీ చేసినట్లు కపిల్ తెలిపారు. ఈ దశలో రెబల్స్‌కు మద్దతుగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వరాదు అని ఆయన వాదించారు. స్పీకర్ డిసైడ్ చేయాల్సిన కేసులో కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు.
అసమ్మతి స్వరాన్ని తొక్కిపెట్టలేం!
RELATED ARTICLES